ETV Bharat / state

ప్రచారానికి వచ్చిన కార్పొరేటర్​ను నిలదీసిన స్థానికులు

author img

By

Published : Nov 23, 2020, 5:42 PM IST

జీహెచ్​ఎంసీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వెంకటాపురం డివిజన్​ కార్పొరేటర్​ సబితను స్థానికులు నిలదీశారు. డివిజన్​ సమస్యల పరిష్కారంలో కార్పొరేటర్​ విఫలమయ్యారని ఆరోపించారు. సమస్యలను తీర్చకుండా ఓట్లు అడగడం సరైన పద్ధతి కాదని మండిపడ్డారు.

locals deposed the corporator came to ghmc election campaign in venkatapur division
ప్రచారానికి వచ్చిన కార్పొరేటర్​ను నిలదీసిన స్థానికులు

సికింద్రాబాద్​లోని వెంకటాపురం డివిజన్ సమస్యల పరిష్కారంలో వెంకటాపురం డివిజన్ కార్పొరేటర్ సబిత విఫలమయ్యారని స్థానికులు ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వెంకటపూర్ డివిజన్​లో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో స్థానికులు వారిని నిలదీశారు. డ్రైనేజీ, తాగునీటి సమస్యలతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని జీహెచ్ఎంసీ అధికారులకు పలుమార్లు విజ్ఞప్తులు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. స్థానిక కార్పొరేటర్ కూడా చూసీచూడనట్లు వ్యవహరించారని వారు తెలిపారు. ప్రస్తుతం తిరిగి ఓట్ల కోసం తమ వద్దకు రావడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

సమస్యలను తీర్చకుండా ఓట్లు అడగడం సరైన పద్ధతి కాదని స్థానికులు తెలిపారు. వరదల సమయంలో పూర్తిగా ఎక్కడికక్కడే మట్టి పేరుకుపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని తమను ఎవరూ పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న సమస్యలను తీర్చే విధంగా ఆమె కృషి చేయాలని... లేనిపక్షంలో తెరాసకు ఓటు వేసేది లేదని పేర్కొన్నారు..

ఇవీ చూడండి: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాసకు గుణపాఠం చెప్పాలి: ఎంపీ అర్వింద్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.