ETV Bharat / state

వధశాలలు.. మద్యం దుకాణాలు బంద్..‌ - liquor shops closed news

హోలీ రోజున జంతు వధశాలలు మూసివేయాలని జీహెచ్​ఎంసీ ఆంక్షలు విధించింది. మరోవైపు మద్యం దుకాణాలు మూసివేయాలని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ఆదేశాలు జారీ చేశారు.

Liquor shops closed, Hyderabad
మద్యం దుకాణాలు బంద్..
author img

By

Published : Mar 28, 2021, 11:17 AM IST

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో జంతు వధశాలలపై జీహెచ్‌ఎంసీ ఆంక్షలు విధించింది. హోలీ పండగ రోజున వధశాలలను తెరవకూడదని, రిటైల్‌ మాంసం దుకాణాలు మూసివేయాలని ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలుంటామని హెచ్చరించింది.

మద్యం దుకాణాలు..:

హోలీ సందర్భంగా రాచకొండ పరిధిలో ముందస్తు నిబంధనలను విధిస్తూ కమిషనర్‌ మహేష్‌భగవత్‌ శనివారం ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 28 (ఆదివారం) సాయంత్రం 6 గంటల నుంచి 30వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం, కల్లు దుకాణాలను మూసి ఉంచాలన్నారు. కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలను తప్పక పాటించాలన్నారు. రంగులు చల్లి.. ఎవ్వరినీ ఇబ్బందులకు గురి చేయొద్దని చెప్పారు. నిబంధనలు ఉల్లఘించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.