ETV Bharat / state

భారీగా మద్యం విక్రయాలు.. సగటున వంద కోట్ల అమ్మకాలు - Greater hyderabad municipal elections 2020

గ్రేటర్‌ ఎన్నికల దృష్ట్యా హైదరాబాద్‌లో మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. 13 రోజుల వ్యవధిలో ఐదు వందల కోట్ల విలువైన మద్యం.. డిపోల నుంచి దుకాణాలకు తరలింది. హైదరాబాద్‌, రంగారెడ్డి, మెదక్‌, మేడ్చల్‌ జిల్లాల్లోనే అధికంగా అమ్మకాలు జరిగినట్లు అబ్కారీ శాఖ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల దృష్ట్యా...రోజుకు సగటున వంద కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోతోంది.

liquor sales in Telangana
భారీగా మద్యం విక్రయాలు.. సగటున వంద కోట్ల అమ్మకాలు
author img

By

Published : Nov 30, 2020, 5:25 AM IST

జీహెచ్​ఎంసీ ఎన్నికల దృష్ట్యా మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. సాధారణ రోజుల్లో విక్రయాల కంటే 40శాతం అధికంగా జరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైనప్పటి నుంచి రోజుకు వంద కోట్లకు మించి అమ్మకాలు జరుగుతున్నాయి. 2019 నవంబరు 29 వరకు రూ.2,239 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. ఈ ఏడాది అదే సమయంలో రూ.2,567 కోట్ల మద్యం అమ్మడైంది. గతేడాదితో పోల్చితే దాదాపు రూ.500 కోట్ల విలువైన మద్యం అధికంగా విక్రయాలు జరిగినట్లు అబ్కారీ శాఖ వెల్లడించింది. …

నవంబరు 17 నుంచి 29 వరకు హైదరాబాద్‌లో రూ.154 కోట్ల విలువైన మద్యం అమ్ముడయింది. రంగారెడ్డి జిల్లాలో 317, మేడ్చల్‌ జిల్లాలో రూ. 42 కోట్లు, మెదక్‌ జిల్లాలో రూ.100 కోట్ల లెక్కన మొత్తం రూ.615 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యాక గ్రేటర్‌ పరిధిలో మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

బల్దియా పోరులో రాజకీయ పార్టీల ప్రచారాలు ఊపందుకున్నాక మద్యానికి గిరాకీ పెరిగింది. ఈ నెల 23న రూ.135 కోట్లు, 24న రూ.107 కోట్లు, 25న రూ.102 కోట్లు, 26న రూ.58 కోట్లు, 27న రూ.170 కోట్లు, 28న రూ.176 కోట్లు, 29న రూ.108 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. …

ఇవీచూడండి: పోలింగ్ కేంద్రాల్లో నిరంతర నిఘా.. ప్రచారం చేస్తే రెండేళ్లు జైలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.