ETV Bharat / state

పండక్కి ఫుల్లుగ తాగిర్రు.. పైసలు మస్త్ వచ్చినయ్! - Latest news in Telangana

అక్టోబరు నెలలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. గతంలో ఎన్నడూ లేనంతగా 2600 కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరిగి గతేడాది అక్టోబరు కంటే వెయ్యి కోట్లు విలువైన మద్యం ఎక్కువ అమ్ముడు పోయింది. గత నెల 22 నుంచి 27 వరకు రోజుకు 100 నుంచి 170 కోట్లు విలువైన మద్యాన్ని మందుబాబులు తాగేశారు.

liquor sales increase
పండక్కి ఫుల్లుగ తాగిర్రు.. పైసలు మస్త్ వచ్చినయ్!
author img

By

Published : Nov 3, 2020, 6:31 AM IST

రాష్ట్రంలో మద్యం అమ్మకాల జోరు పెరిగింది. దసరా పండుగకు భారీ ఎత్తున అమ్మకాలు జరిగినట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. 2019 అక్టోబరు నెలలో రూ.1,663 కోట్లు విలువైన 27లక్షల కేసులు లిక్కర్‌, 38లక్షల కేసులు బీరు అమ్ముడు పోయింది. అదే ఈ ఏడాది అక్టోబరు నెలలో తీసుకుంటే.... రూ.2,623 కోట్లు విలువైన 31.68లక్షల కేసులు లిక్కర్‌, 26.93లక్షల కేసులు బీరు అమ్ముడు పోయింది. అంటే ఒక్క అక్టోబరు నెలలోనే ఏకంగా వెయ్యి కోట్లు విలువైన మద్యం అధికంగా విక్రయాలు జరిగినట్లు అబ్కారీ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

అమ్ముపోయిన మద్యాన్ని పరిశీలిస్తే గత ఏడాది అక్టోబరులో జరిగిన లిక్కర్‌ కంటే ఈ ఏడాది అక్టోబరులో 4.68లక్షల కేసులు అధికంగా అమ్ముపోయాయి. అదే బీరు తీసుకుంటే గత అక్టోబరు కంటే దాదాపు 11లక్షల కేస్​లు బీరు అమ్మకాలు పడిపోయాయి. హైదరాబాద్‌ నగరంలో ఎక్కువగా బీరు వాడకం ఉంటుందని ఇప్పటికీ కొన్ని విభాగాలకు చెందిన కార్యాలయాలు పూర్తి స్థాయిలో పనిచేయకపోవడం, కొన్ని వాణిజ్య సంస్థల్లో పూర్తి స్థాయిలో ఉద్యోగులు పని చేయకపోవడం, కొన్ని శాఖలు ఇంటి నుంచి పని చేసే విధానం కొనసాగడం లాంటి కారణాలతో బీరు వాడకం పడిపోయినట్లు అబ్కారీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇప్పటి వరకు ఏ సంవత్సరంలో, ఏ నెలలో కూడా రూ.2,600 కోట్లు విలువైన మద్యం అమ్ముడు పోలేదని... ఇది రికార్డు స్థాయిలో జరిగిన విక్రయాలుగా అధికారులు చెబుతున్నారు. సాధారణంగా రోజుకు 60 నుంచి 70 కోట్లు విలువైన మద్యం అమ్ముడు పోవడం సర్వసాధారణం, కానీ అక్టోబరు నెలలో... దసరా పర్వదినం పురష్కరించుకుని వారం రోజులపాటు వంద కోట్లు విలువకు మించి అమ్మకాలు జరిగినట్లు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

ఈ నెల 21న రూ.87.6 కోట్లు విలువైన మద్యం అమ్మకాలు జరగ్గా 22న రూ.131.33 కోట్లు విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. అదే 23న ఏకంగా రూ.174.63 కోట్లు విలువైన మద్యం అమ్ముడు పోయింది. 24న రూ.99.8 కోట్లు విలువైన మద్యం విక్రయాలు జరగ్గా.... 25, 26 తేదీల్లో ఏకంగా రూ.132 కోట్లు విలువైన మద్యం అమ్ముడుపోగా, 27న రూ.116.54 కోట్లు విలువైన విక్రయాలు జరిగినట్లు అబ్కారీ శాఖ అధికారులు తెలిపారు. ఇదే స్థాయిలో అమ్మకాలు జరిగితే ఈ ఆర్థిక ఏడాదిలో ప్రభుత్వానికి మద్యం అమ్మకాలపై వచ్చే వ్యాట్‌, ఎక్సైజ్‌ డ్యూటీ కూడా భారీగా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.