ETV Bharat / state

న్యూ ఇయర్​ కిక్కు - 4 రోజుల్లో రూ.770 కోట్ల మద్యం అమ్మకాలు - Liquor Sales Telangana 23

Liquor Sales In December 2023 Telangana : రాష్ట్రంలో డిసెంబర్‌లో భారీమొత్తంలో మద్యం అమ్ముడుపోయింది. కొత్తమద్యం విధానం డిసెంబర్‌ నుంచే అమల్లోకి రావడం, నూతన సంవత్సరం కలిసి రావడంతో నెలరోజుల్లో ఏకంగా 4వేల 297 కోట్లు విలువైన విక్రయాలు జరిగినట్లు అబ్కారీశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈనెల 28 నుంచి 31 వరకు నాలుగు రోజుల వ్యవధిలోనే 777 కోట్లు విలువైన అమ్మకాలు జరిగినట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి

Record Level Sales in Telangana 2023
Liquor Sales In December
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 2, 2024, 8:47 AM IST

నూతన సంవత్సరం వేళ భారీగా అమ్ముడుపోయిన మద్యం

Liquor Sales In December 2023 Telangana : తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్‌ నెలలో మద్యం ప్రియలు పెద్ద మొత్తంలో మద్యాన్ని తాగేశారు. 2023 డిసెంబర్‌ నెలలో రూ.4297 కోట్ల విలువైన 43.60 లక్షల కేసులు లిక్కర్‌, 46.22లక్షల కేసులు బీరు విక్రయాలు జరిగాయి. ఈనెల 28నుంచి 31వరకు నాలుగు రోజుల వ్యవధిలోనే 777 కోట్లు విలువైన అమ్మకాలు జరిగినట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

Telangana Liquor Sales In December 2023 : డిసెంబర్‌ నెల నుంచే కొత్త మద్యం విధానం అమలులోకి వచ్చింది. అంటే పాత లైసెన్స్‌దారుల స్థానంలో కొత్తగా మద్యం దుకాణాల లైసెన్స్‌లను దక్కించుకున్న లైసెన్స్‌దారులు దుకాణాలు ఏర్పాటు చేశారు. దీనికి తోడు డిసెంబర్‌ ఏడాది చివర నెల కావడం, కొత్త సంవత్సరం ముందు మూడు నాలుగు రోజులు అత్యధికంగా మద్యం అమ్ముడు పోవడం సర్వసాధారణంగా ఉంటుంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని దుకాణదారులు భారీ ఎత్తున మద్యాన్ని నిల్వ చేసుకున్నారు.

మందు బాబులా మజాకా.. మద్యం అమ్మకాలతో రాష్ట్ర​ ఖజానాకు కిక్కే కిక్కు

రంగారెడ్డి, వరంగల్ జిల్లాలల్లో అధికం : డిసెంబరు నెలలో చివరి నాలుగు రోజుల్లో భారీగా మద్యం అమ్ముడు పోయింది. నాలుగు రోజుల్లో రూ.777 కోట్లు విలువైన 7.12 లక్షల కేసులు లిక్కర్‌, 7.84లక్షల కేసుల బీరు అమ్ముడు పోయినట్లు బ్కారీశాఖ అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో ఉమ్మడి జిల్లాల వారీగా తీసుకుంటే .గత ఏడాది కంటే రంగారెడ్డి, వరంగల్ జిల్లాలల్లో మాత్రమే అధికంగా అమ్ముడు పోయింది. ఈ రెండు జిల్లాల పరిధిలో 2022లో చివరి నాలుగు రోజుల్లో రంగారెడ్డి జిల్లాలో 204 కోట్లు విలువైన మద్యం అమ్ముడు పోగా 2023 డిసెంబరులో అదే నాలుగు రోజుల్లో 242 కోట్లు విలువైన మద్యం అమ్ముడు పోయింది.

కొత్త సంవత్సరం భారీగా మద్యం అమ్మకాలు : వరంగల్‌లో గత 2022లో 64 కోట్లు విలువైన మద్యం అమ్ముడు పోగా, 2023లో రూ.70 కోట్లు విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా 2022 డిసెంబర్‌ చివరి నాలుగు రోజుల్లో అమ్ముడు పోయిన మద్యం కంటే 2023 డిసెంబర్‌లో తక్కువ అమ్ముడు పోయింది. డిసెంబర్‌ 30వ తేదీన ఒక్క రోజునే రూ.313 కోట్లు విలువైన మద్యం అమ్ముడు పోగా 28వ తేదీన రూ.134 కోట్లు, 29వ తేదీన 180 కోట్లు, 31వ తేదీన 150 కోట్లు విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్‌ శాఖ అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

రాష్ట్రంలో ఎన్నికల వేళ తగ్గిన మద్యం అమ్మకాలు - అక్రమ లిక్కర్​పై ఎక్సైజ్ శాఖ ఫోకస్

Telangana govt bans illegal liquor : అక్రమ మద్యానికి అడ్డుకట్ట.. ముమ్మర తనిఖీలు

ఎన్నికల వేళ ఎక్సైజ్​శాఖ అలర్ట్ - వాటి సరఫరాపై ప్రత్యేక నిఘా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.