ETV Bharat / state

లింగోజిగూడ కార్పొరేటర్​గా రాజశేఖర్‌రెడ్డి ప్రమాణస్వీకారం

Lingojiguda Corporator Rajasekhar Reddy sworn
లింగోజిగూడ కార్పొరేటర్​గా రాజశేఖర్‌రెడ్డి ప్రమాణస్వీకారం
author img

By

Published : Jun 29, 2021, 11:57 AM IST

10:57 June 29

రాజశేఖర్​ రెడ్డి చేత ప్రమాణం చేయించిన మేయర్ విజయలక్ష్మీ

        హైదరాబాద్ లింగోజిగూడ కార్పొరేటర్​గా దరిపల్లి​ రాజశేఖర్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. మేయర్ గద్వాల విజయలక్ష్మీ ఆయన చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ నూతన ఆధ్యక్షులు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. లింగోజిగూడ డివిజన్ ఉపఎన్నికల్లో రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు.  

        బల్దియా ఎన్నికల్లో భాజపా నుంచి పోటీచేసి విజయం సాధించిన రమేశ్‌గౌడ్‌ ప్రమాణస్వీకారం కూడా చేయకుండానే కరోనాతో మృతి చెందారు. ఆకుల రమేష్ గౌడ్ రమేశ్‌ గౌడ్‌ మృతితో ఆ డివిజన్‌ను ఏకగ్రీవం కోసం  భాజపా యత్నించింది. ఆ పార్టీ నేతలు మంత్రి కేటీఆర్​ను కలిసి... లింగోజిగూడ డివిజన్‌లో మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. వారి వినతిపై సానుకూలంగా స్పందించిన ఆయన.. ఉపఎన్నికల్లో తెరాస అభ్యర్థిని నిలపమని హామీ ఇచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీని ఒప్పించేందుకు భాజపా నేతలు యత్నించినా... లాభం లేకపోయింది. అభ్యర్థిని వెనక్కి తీసుకునేందుకు కాంగ్రెస్‌ నిరాకరించడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. ఏప్రిల్‌ 30న ఎన్నికలు జరగ్గా... కాంగ్రెస్ అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి విజయం సాధించారు. 

ఇదీ చూడండి: టైప్‌1 మధుమేహాన్ని ఆపే మందు!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.