రానున్న మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఆగ్నేయ ఝార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 7.6 కిమీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఫలితంగా చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు రత్నప్రభ వెల్లడించారు.
ఆదిలాబాద్, నిర్మల్, కుమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురవనున్నట్లు తెలిపారు.
ఇవీ చూడండి : 'పరిస్థితి దయనీయంగా ఉంది.. ప్రభుత్వం ఇకనైనా నిద్రలేవాలి'