కార్తీకమాసం సందర్భంగా భాగ్యనగరంలోని ఆలయాలన్నీ ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నాయి. నారాయణగూడలోని గాంధీ కుటీర్ వద్దనున్న శ్రీ భూలక్ష్మి దుర్గాదేవి ఆలయంలో కార్తీకమాస మహోత్సవాలు కన్నుల పండువగా నిర్వహించారు. ఆలయ సిబ్బంది ఆకాశ దీప ప్రజ్వలనతో ప్రారంభించి...116 దీపాల అలంకరణ చేశారు. కార్యక్రమంలో మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొని దీపాలు వెలిగించారు. తమ కుటుంబాలను చల్లగా చూడాలంటూ పరమేశ్వరుని వేడుకున్నారు.
ఇదీ చూడండి : ఆర్టీసీ కార్మికుల సమ్మె యథాతథం: థామస్‌రెడ్డి