రాష్ట్రంలో రాగల మూడ్రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 7.6కిలోమీటర్ల ఎత్తు వరకు కేంద్రీకృతమైందని తెలిపింది.
ఈ ఆవర్తన ప్రభావంతో మధ్య బంగాళాఖాతంలో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా ప్రయాణించి తదుపరి 48 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వివరించింది. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలోకి కింది స్థాయి గాలులు పశ్చిమ దిశ నుంచి వీస్తున్నాయని పేర్కొంది.
ఇదీ చదవండి: Be Alert: వరుస పండుగల నేపథ్యంలో ఈ జాగ్రత్తలు అవసరం!!