ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలిచేందుకు చైనా... ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని లెఫ్టినెంట్ జనరల్ ఏఆర్కే రెడ్డి అన్నారు. ముందస్తు ప్రణాళికతోనే చైనా... భారత జవాన్లపై దాడి చేసిందని మండిపడ్డారు. సామ్రాజ్యాన్ని విస్తరించుకునే దిశగా అడుగులు వేస్తూ.. దాడులకు దిగుతోందన్నారు. అన్నిరంగాల్లో ఎదుగుతున్న భారతదేశాన్ని తక్కువ చేయడమే చైనా ఉద్దేశమని ఆయన అన్నారు. భారత్- చైనా మధ్య వివాదానికి ప్రధానంగా ఆధిపత్య పోరు, సరిహద్దు వివాదం.. కారణాలుగా ఆయన చెప్పారు. భారత్తో ఒప్పందాలు చేసుకున్నప్పటికీ వాటిని విస్మరించడం చైనాకు అలవాటేనన్నారు. భారత్తో సరిహద్దు గొడవలున్న పాకిస్థాన్, చైనా రెండు దేశాల మధ్య నైతిక విలువల్లేని స్నేహం ఉందన్నారు.
ఇవీ చూడండి: 'సైనికుల మృతికి చైనాపై ప్రతీకారం ఎప్పుడు?'