ETV Bharat / state

డ్రంక్​ అండ్​ డ్రైవ్​ బాబుల లైసెన్సులు సస్పెండ్.. ఏకంగా 8 వేలకు పైనే..!

Driving License Suspended : హైదరాబాద్​లో మద్యం తాగి వాహనాలు నడిపే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలోనే మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్న వారిపై రవాణా శాఖ కఠిన చర్యలు తీసుకుంటోంది. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వారి లైసెన్సులను తాత్కాలికంగా రద్దు చేయాలని నిర్ణయించింది. గడిచిన రెండేళ్లలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 8,418 మంది లైసెన్స్​లను సస్పెండ్ చేసినట్లు రవాణాశాఖ ప్రకటించింది.

License suspended
License suspended
author img

By

Published : Jan 1, 2023, 3:22 PM IST

Driving License Suspended : హైదరాబాద్​లో గడిచిన రెండేళ్లలో 8,418 డ్రైవింగ్ లైసెన్స్​లను సస్పెండ్ చేసినట్లు రవాణాశాఖ సంయుక్త కమిషనర్ పాండురంగ నాయక్ స్పష్టం చేశారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదాలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. రవాణా శాఖ ఈ నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు. అందుకే 2021లో 2,599 లైసెన్స్​లను సస్పెండ్ చేశామని అన్నారు. 2022లో తాగి వాహనాలు నడిపే వారి సంఖ్య దురదృష్టవశాత్తు రెట్టింపు అయ్యిందని చెప్పారు. 2022లో 5,819 డ్రైవింగ్ లైసెన్స్​లను సస్పెండ్ చేశామని పేర్కొన్నారు.

2021లో సస్పెండ్ చేసిన డ్రైవింగ్ లైసెన్స్​లు..

  • హైదరాబాద్ సెంట్రల్ జోన్ పరిధిలో 770 డ్రైవింగ్ లైసెన్స్ లు
  • నార్త్ జోన్ పరిధిలో 435 డ్రైవింగ్ లైసెన్స్​లు
  • ఈస్ట్ జోన్ పరిధిలో 284 డ్రైవింగ్ లైసెన్స్​లు
  • సౌత్ జోన్ పరిధిలో 556 డ్రైవింగ్ లైసెన్స్​లు
  • వెస్ట్ జోన్ పరిధిలో 554 డ్రైవింగ్ లైసెన్స్​లు సస్పెండ్ చేసినట్లు రవాణాశాఖ ప్రకటింది.

2022లో సస్పెండ్ చేసిన డ్రైవింగ్ లైసెన్స్​లు..

  • హైదరాబాద్ సెంట్రల్ జోన్ పరిధిలో 1,710 డ్రైవింగ్ లైసెన్స్ లు
  • నార్త్ జోన్ పరిధిలో 1,103 డ్రైవింగ్ లైసెన్స్​లు
  • ఈస్ట్ జోన్ పరిధిలో 510 డ్రైవింగ్ లైసెన్స్​లు
  • సౌత్ జోన్ పరిధిలో 1,151 డ్రైవింగ్ లైసెన్స్​లు
  • వెస్ట్ జోన్ పరిధిలో 1,335 డ్రైవింగ్ లైసెన్స్​లు సస్పెండ్ చేసినట్లు రవాణాశాఖ తెలిపింది.

గడిచిన రెండేళ్లలో సస్పెండ్ చేసిన డ్రైవింగ్ లైసెన్స్​లు..

  • హైదరాబాద్ సెంట్రల్ జోన్ పరిధిలో 2,480 డ్రైవింగ్ లైసెన్స్​లు
  • నార్త్ జోన్ పరిధిలో 1,538 డ్రైవింగ్ లైసెన్స్​లు
  • ఈస్ట్ జోన్ పరిధిలో 794 డ్రైవింగ్ లైసెన్స్​లు
  • సౌత్ జోన్ పరిధిలో 1,707 డ్రైవింగ్ లైసెన్స్​లు
  • వెస్ట్ జోన్ పరిధిలో 1,899 డ్రైవింగ్ లైసెన్స్​లు సస్పెండ్ చేసినట్లు రవాణా శాఖ వెల్లడించింది.

ఇవీ చదవండి: హైదరాబాద్​ రాష్ట్రానికి కల్పతరువు.. అందుకే ఈ అభివృద్ధి: మంత్రి కేటీఆర్‌

రెండేళ్ల నిషేధం తర్వాత 'భీమా కోరెగావ్'లో వేడుకలు.. భారీగా జనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.