ETV Bharat / state

నగరంలో 14 మంది బాలకార్మికులకు విముక్తి - గాజుల పరిశ్రమలో14 మంది బాలలకు విముక్తి

వారంతా 14 ఏళ్లలోపు పిల్లలు.. పాఠశాలకు వెళ్లాల్సిన సమయంలో పనులు చేస్తున్నారు. నెలకు రూ. 5 వేలు ఇప్పిస్తామని పిల్లల తల్లిదండ్రులకు చెప్పి హైదరాబాద్​ తీసుకొచ్చారు. గట్టుచప్పుడు కాకుండా గాజుల పరిశ్రమలో వెట్టిచాకిరి చేయిస్తున్నారు. ఈ ఘటన హైదరాబాద్​ నడిబొడ్డున ఉన్న ఛత్రినాక పోలీస్​స్టేషన్ పరిధిలో జరిగింది.

Liberation of 14 child labour in the hyderabad city
నగరంలో 14 మంది బాలకార్మికులకు విముక్తి
author img

By

Published : Mar 2, 2020, 11:03 PM IST

హైదరాబాద్ పాతబస్తీ ఛత్రినాక పోలీస్​స్టేషన్ పరిధిలో 14 మంది బాల కార్మికులకు చైల్డ్​​ హెల్ప్​లైన్ అధికారులు, దక్షిణ మండలం టాస్క్​ఫోర్స్, ఛత్రినాక పోలీసులు సంయుక్తంగా విముక్తి కల్పించారు. పటేల్​నగర్, రాఘవేంద్ర నగర్లలోని గాజుల పరిశ్రమలో గుట్టుచప్పుడు కాకుండా బలకార్మికులతో వెట్టిచాకిరి చేయిస్తున్నారు. ఈ అంశంపై ఓ వ్యక్తి చైల్డ్​​ హెల్ప్​లైన్​కు ఫోన్​ చేయగా రంగంలోకి దిగిన అధికారులు, పోలీసులు పిల్లలను విడిపించారు.

బిహార్​కు చెందిన తరుణ్, సంతోష్​లను నిర్వాహకులుగా గుర్తించారు. బిహార్ నుంచి నెలకు రూ. ఐదు వేల చొప్పున ఇస్తామని బాలల తల్లిదండ్రులను మభ్యపెట్టి ఇక్కడికి తీసుకొచ్చి పనులు చేయిస్తున్నారు. ఈ దాడుల్లో హైదరాబాద్ చైల్డ్​​ హెల్ప్​లైన్ అధికారులు, దక్షిణ మండలం టాస్క్​ఫోర్స్, ఛత్రినాక పోలీసులు పాల్గొన్నారు. నిర్వాహకులు ఇద్దరిపై ఛత్రినాక పోలీసులు కేసు నమోదు చేశారు.

నగరంలో 14 మంది బాలకార్మికులకు విముక్తి

ఇదీ చూడండి : వరంగల్​ సీపీ​పై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​లో ఫిర్యాదు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.