ETV Bharat / state

విశాఖలో ఇళ్ల గోడల నుంచి ఇంకా స్టైరీన్​ వాసన - విశాఖ తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ ఎల్​జీ పాలిమర్స్ పరిసర గ్రామమైన వేంకటాద్రి నగర్​లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఎల్​జీ పాలిమర్స్ పరిశ్రమ పక్కనే ఉన్న ఈ గ్రామవాసులే మృతుల్లో ఎక్కువ మంది. ప్రమాద సమయంలో వాయువు తీవ్రత కూడా అక్కడే ఎక్కువగా ఉంది. ఇప్పటికీ ఇళ్లలో స్టైరీన్ గ్యాస్ వాసన వస్తుండటం వల్ల.. ఇళ్లలో ఉండలేకపోతున్నామని గ్రామస్థులు అంటున్నారు. తమ బాధను చెప్పుకుంటున్నా అధికారులు పట్టించుకోవటం లేదని వాపోతున్నారు.

lg-polymers-surrounding-villages-are-facing-health-problems
విశాఖలో ఇళ్ల గోడల నుంచి ఇంకా స్టైరీన్​ వాసన
author img

By

Published : May 28, 2020, 1:00 PM IST

ఏపీలోని విశాఖ ఎల్​జీ పాలిమర్స్ పరిశ్రమ గోడను ఆనుకుని ఉన్న గ్రామాలు వెంకట్రాది నగర్, వెంకటాపురం. ప్రమాదం జరిగిన ట్యాంక్​లు.. గ్రామస్థుల ఇళ్ల నుంచి 50 మీటర్ల దూరంలోనే ఉన్నాయి. ఈ కారణంగానే రసాయన వాయువు తీవత్ర ఎక్కువగా ఉందని స్థానికులు అంటున్నారు. ఇళ్ల గోడల నుంచి ఇంకా రసాయన వాసన వస్తోందని స్థానికులు చెబుతున్నారు.

స్టైరీన్ వాసన వస్తుండటం వల్ల చిన్న పిల్లలను ఇళ్లకు తీసుకురాలేకపోతున్నామని గ్రామస్థులు తెలిపారు. ఈ ప్రమాదం తర్వాత తరచూ అనారోగ్యానికి గురవుతున్నట్లు చెబుతున్నారు. తమ ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని కోరుతున్నారు.

ప్రమాదం జరిగిన తర్వాత ఇళ్లలో విలువైన వస్తువులు పోయాయని ఫిర్యాదుచేసిన పోలీసులు పట్టించుకోవటంలేదని వాపోతున్నారు. వాయువు తీవ్రత ఇంకా ఉందని చెబితే పుకార్లు పుట్టిస్తున్నారని తిరిగి తమపై కేసులు బనాయిస్తామని పోలీసులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. ప్రజాప్రతినిధులు కూడా తమను పట్టించుకోవడంలేదని ఆవేదన చెందుతున్నారు.

ఇదీ చదవండి : భూముల విక్రయంపై మరో రెండు వ్యాజ్యాలు.. నేడు విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.