కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఆల్మట్టి ఎత్తు పెంపును రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలని సీఎం కేసీఆర్‌కు కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డిలు బహిరంగ లేఖలు రాశారు.
ప్రస్తుతం ఉన్న 519.6 మీటర్లుగా ఉన్న ఎత్తును 524.2 మీటర్లకు పెంచే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం పంపినట్టు కర్ణాటక నీటి వనరుల శాఖ మంత్రి రమేష్ జార్కిహోలి స్వయంగా ప్రకటించారు. ఈ తరుణంలో దక్షిణ తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తక్షణమే సీఎం కేసీఆర్ జోక్యం చేసుకుని ఆల్మట్టి డ్యామ్ ఎత్తును పెంచకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి : జలకళ: కృష్ణా పరివాహక ప్రాజెక్టులకు వరద తాకిడి