ETV Bharat / state

ముంబయిలా కాకుండా... మేల్కొందాం!

లాక్​డౌన్​ సడలింపుల తర్వాత ముంబయిలో కరోనా విలయతాండవం చేస్తోంది. హైదరాబాద్​లో అంత తీవ్రత లేకపోయినా.. ప్రతి ఒక్కరు అప్రమత్తం కాకపోతే... ఇక్కడా అదే పరిస్థితి నెలకొనే అవకాశాలున్నాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ తరుణంలో మరింత అప్రమత్తంగా ఉంటే కేసులను కట్టడి చేయవచ్చని సూచిస్తున్నారు.

let-hyderabad-not-become-mumbai-in-case-of-corona-spread
ముంబయిలా కాకుండా... మేల్కొందాం!
author img

By

Published : Jun 4, 2020, 10:06 AM IST

దేశ ఆర్థిక రాజధాని ముంబయి కరోనా తాండవంతో చిగురుటాకులా వణుకుతోంది. అక్కడ బాధితుల సంఖ్య 41 వేలు దాటింది. మృతుల సంఖ్య పెరుగుతోంది. సడలింపుల తర్వాత వైరస్‌ మరింత విజృంభిస్తోంది. భాగ్యనగరంలో ముంబయి అంత తీవ్రత లేకపోయినా... ప్రతి ఒక్కరు అప్రమత్తం కాకపోతే మన వద్దా ఆ పరిస్థితి ఎంతో దూరంలో లేదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. నగరంలో రోజూ నమోదవుతున్న కేసుల సంఖ్య ఆందోళనను మరింత పెంచుతోంది. మున్ముందు కేసుల సంఖ్య పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నగరం కీలక దశలో ఉన్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. ఈ తరుణంలో మరింత అప్రమత్తంగా ఉంటే కేసులను కట్టడి చేయవచ్చని సూచిస్తున్నారు. లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపు తర్వాత రాకపోకలు బాగా పెరిగాయి. వ్యాపార, వాణిజ్య సంస్థలకు వినియోగదారుల తాకిడి పెరిగింది. వైరస్‌ వ్యాప్తి పెరుగుతోంది.

సడలించారంటే కరోనా లేదని కాదు!

లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించారంటే కరోనా భయం తొలగిపోయిందని కాదు. నగరంలో కొందరు కొవిడ్‌-19 స్ఫురణ లేకుండా తిరిగేయడం ఆందోళన రేకెత్తిస్తోంది. గతంలో కంటే బాధితుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. పని లేకపోయినా కొందరు బయటకు వచ్చేస్తున్నారు. మాస్క్‌లు లేకుండానే కన్పిస్తున్నారు. ఎడం పాటించలేదు. ప్రస్తుతం వైరస్‌ ఎక్కడ ఉందో గుర్తించడం కష్టమైంది. వ్యాపారస్థులు వినియోగదారులకు మాస్క్‌ తప్పనిసరి చేయడం, థర్మో స్క్రీనింగ్‌ నిర్వహించడం, శానిటైజరు చల్లడం మరువకూడదు. ఎవరికివారు ఇంట్లోకి వెళ్లే ముందు చేతులను శుభ్రంగా సబ్బుతో కానీ, శానిటైజర్‌తో కానీ కడుక్కోవాలి. అప్పుడే వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయగలమని వైద్యులు సూచిస్తున్నారు.

ఇదీ చూడండి: ముఖ్యమంత్రి కేసీఆర్​ కాన్వాయ్​కి ఓవర్​ స్పీడ్​ చలానాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.