ఏపీలోని తిరుమలలో చిరుతల సంచారం మళ్లీ పెరిగింది. జన సంచారం లేని కారణంగా.. చిరుతపులులు కొండపై యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. పాంచజన్యం అతిథి గృహం వద్ద శుక్రవారం అర్ధరాత్రి సమయంలో చిరుత సంచరిస్తోందన్న సమాచారంతో అటవీ సిబ్బంది.. అక్కడికి చేరుకున్నారు. డప్పుల శబ్దంతో అటవీ ప్రాంతంలోకి తరిమే ప్రయత్నంచేశారు. డప్పుల చప్పుడుకి.. బండరాయి వెనుక దాక్కున్న చిరుత.. కొంత సమయం తరువాత అక్కడినుంచి పరుగులు పెట్టింది.
ఇదీ చదవండి: