ETV Bharat / state

hyderabad consumer court: పరిహారం చెల్లించాలని లియో ప్యాకర్స్‌ అండ్‌ మూవర్స్‌కు ఆదేశం - leo pakers and movers

hyderabad consumer court : వస్తువులను భద్రపరుస్తామని చెప్పి.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన లియో ప్యాకర్స్​ అండ్​ మూవర్స్​ తీరుపై జిల్లా వినియోగదారుల కమిషన్​ అభ్యంతరం వ్యక్తం చేసింది. వస్తువుల మరమ్మతులకు రూ.50 వేలు, పరిహారంగా రెండు లక్షల రూపాయలు, కేసు ఖర్చుల కోసం మరో రూ.5 వేలు చెల్లించాలని తీర్పు ఇచ్చింది

consumer court
consumer court
author img

By

Published : Feb 3, 2022, 11:32 AM IST

hyderabad consumer court : వస్తువులను భద్రంగా చూసుకుంటామని హామీ ఇచ్చి నిర్లక్ష్యంగా వ్యవహరించిన లియో ప్యాకర్స్‌ అండ్‌ మూవర్స్‌ తీరుపై జిల్లా వినియోగదారుల కమిషన్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. మరమ్మతులకు గురైన వాటికి పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీచేసింది.

ఫిర్యాదుదారుడు హైదరాబాద్​ బంజారాహిల్స్‌కు చెందిన అశోక్‌ కొండపాటి విశ్రాంత ఉద్యోగి. తాను ఉంటున్న ఇంట్లోని వస్తువులను వేరే చోటికి తరలించి భద్రపరిచేందుకు.. లియో ప్యాకర్స్‌ అండ్‌ మూవర్స్‌ ప్రైవేట్​ లిమిటెడ్‌ సంస్థను ఆశ్రయించారు. గచ్చిబౌలి, బాలానగర్‌ ప్రాంతాల్లోని వేర్​హౌస్​లలో సామగ్రిని భద్రపరచొచ్చు అని సంస్థ చెప్పింది. అశోక్‌ స్వయంగా ఈ రెండు ప్రాంతాలను పరిశీలించిన అనంతరం బాలానగర్‌ వేర్​హౌస్​కు తరలించాలని కోరారు. ఇందుకోసం 15 నెలలకు రూ.1,69,648 (డెలివరీ, స్టోరేజ్‌ ఛార్జీలు) చెల్లించారు.

అనంతరం కొండాపూర్‌లో తాను కొత్తగా కొనుగోలు చేసిన అపార్ట్‌మెంట్‌కు ఆయా వస్తువులను భద్రంగా చేర్చాలని లియో ప్యాకర్స్‌ అండ్‌ మూవర్స్‌ సంస్థను అశోక్​ కోరారు. అయితే తన వస్తువులు గచ్చిబౌలిలోని వేర్​హౌస్​లో ఉన్నాయని తెలుసుకొని అశోక్​ అక్కడకి వెళ్లారు. అయితే తన వస్తువులన్నీ పాడైపోయి కనిపించాయి. దీనిపై సదరు సంస్థ ప్రశ్నించారు. తన అనుమతి లేకుండా వస్తువులను గచ్చిబౌలికి ఎందుకు తరలించారని నిలదీశారు. తనకు పరిహారం ఇవ్వాలని డిమాండ్​ చేశారు. దీనిపై లియో ప్యాకర్స్‌ అండ్‌ మూవర్స్‌ సంస్థ స్పందించలేదని అశోక్​ తెలిపారు. దీంతో జిల్లా వినియోగదారుల కమిషన్​ను ఆశ్రయించినట్లు చెప్పారు. అశోక్​ పిటిషన్​ను విచారించిన వినియోగదారుల కమిషన్​.. వస్తువుల మరమ్మతులకు రూ.50 వేలు, పరిహారంగా రెండు లక్షల రూపాయలు, కేసు ఖర్చుల కోసం మరో రూ.5 వేలు చెల్లించాలని తీర్పు ఇచ్చింది.

ఇదీచూడండి: నిరుద్యోగులకు గుడ్​ న్యూస్​.. ఈ నెలలోనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.