ETV Bharat / state

ప్రజా వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్త పోరుకు లెఫ్ట్ పార్టీల వ్యూహం

విద్యుత్​ పోరాటంలో అసువులు బాసిన అమరవీరులకు బషీర్​బాగ్​లోని స్థూపం వద్ద లెఫ్ట్​ పార్టీల నాయకులు నివాళులర్పించారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వాలకు అవలంబిస్తున్న పాలకులకు విద్యుత్​ ఉద్యమం హెచ్చరికలాంటిదని వామపక్ష నేతలు అన్నారు.

left parties pays tribute to vidyuth martyrs

author img

By

Published : Aug 28, 2020, 2:44 PM IST

హైదరాబాద్​ బషీర్​బాగ్​లోని విద్యుత్​ అమరవీరుల స్థూపం వద్ద సీపీఐ, సీపీఎం నాయకులు నివాళులు అర్పించారు. ఇరవై ఏళ్ల క్రితం చేపట్టిన విద్యుత్​ ఉద్యమం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వాలకు హెచ్చరిక అని వామపక్ష నేతలు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా పోరాడి అసువులు బాసిన విద్యుత్ అమర వీరులను వామపక్ష పార్టీ నాయకులు స్మరించుకున్నారు.

కాల్పుల ఘటనకు 20ఏళ్లు

2000 సంవత్సరం ఆగస్టు 28న పెరిగిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ఛలో అసెంబ్లీకి వెళ్తున్న ప్రజలపై అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కాల్పులు జరిపిందన్నారు. ఈ ఘటనలో రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి ప్రాణాలు కోల్పోయారు. బషీర్​బాగ్ కాల్పుల ఘటనకు నేటితో ఇరవై ఏళ్లు పూర్తయ్యింది.

ప్రజావ్యతిరేక విధానాలపై దేశవ్యాప్త పోరాటం

ఆనాటి విద్యుత్ ఉద్యమం ప్రపంచంలోని సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో తలమానికంగా నిలిచిపోయిందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ మళ్లీ అవే సంస్కరణలు అమలు పరిచేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బషీర్​బాగ్ ఉద్యమ స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై దేశ వ్యాప్తంగా ఉద్యమిస్తామన్నారు.

ఇవీ చూడండి: పారిశ్రామిక పార్కులకు కేంద్ర సహకారం కావాలి: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.