ETV Bharat / state

'ప్రజల ఇబ్బందులు పాలకులకు పట్టడం లేదు'

గత 19 రోజులుగా పెరుగుతోన్న పెట్రోల్​, డీజిల్​ ధరలకు నిరసనగా హైదరాబాద్​ నారాయణగూడలోని వైఎంసీఏ వద్ద వామపక్షాలు ధర్నా నిర్వహించాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. వెంటనే ఇంధన ధరలను తగ్గించాలని డిమాండ్​ చేశాయి.

Left parties dharna at narayanaguda in hyderabad
'ప్రజల ఇబ్బందులు పాలకులకు పట్టడం లేదు'
author img

By

Published : Jun 25, 2020, 1:51 PM IST

మోదీ ప్రభుత్వం కార్పొరేట్​కు అనుకూలంగా వ్యవహరిస్తోందని వామపక్ష నేతలు ధ్వజమెత్తారు. ప్రజల ఇబ్బందులు పాలకులకు పట్టడం లేదని వారు మండిపడ్డారు. హైదరాబాద్ నారాయణగూడలోని వైఎంసీఏ వద్ద పెట్రోల్‌, డీజిల్ ధరల పెంపునకు వ్యతిరేకంగా వామపక్షాలు ధర్నా నిర్వహించాయి. కార్యక్రమంలో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కరోనా వల్ల ఇప్పటికే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. ఉపాధి లేక పూట గడవడమే గగనమైందని బీవీ రాఘవులు పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంధన ధరలు పెంచడం దారుణమని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వల్ల రవాణా వ్యయం పెరిగి నిత్యావసరాల ధరలూ పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

'ప్రజల ఇబ్బందులు పాలకులకు పట్టడం లేదు'

అంతర్జాతీయ మార్కెట్​లో చమురు ధరలు తగ్గుతున్నా.. కేంద్రం మాత్రం భారీగా పెంచుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి దుయ్యబట్టారు. స్వల్ప వ్యవధిలోనే రూ.10 పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల రూపంలో ఆదాయం పెరిగిందని.. ప్రజలు మాత్రం ఇబ్బందులు పడుతున్నారని చాడ విమర్శించారు. వెంటనే ఇంధన ధరలను తగ్గించాలని.. లేనిపక్షంలో ప్రజా మద్దతుతో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇదీచూడండి: 'నాటిన ప్రతి మొక్కను కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.