ETV Bharat / state

Sprinklar in Hyderabad: రాష్ట్రంలో స్ప్రింక్లర్‌ కార్యాలయం.. వెయ్యి మందికి ఉపాధి - కేటీఆర్ బృందం

యుఎస్​కు చెందిన ప్రముఖ ఐటీ కంపెనీ స్ప్రింక్లర్ హైదరాబాద్​లో తన నూతన కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్​లో నూతన ఐటీ కార్యాలయం ద్వారా వెయ్యి మంది ఐటీ ఉద్యోగులకు ఉపాధి లభించనుంది.

Sprinklar in Hyderabad
న్యూయార్క్‌లో కంపెనీ ప్రతినిధులతో కేటీఆర్
author img

By

Published : Mar 27, 2022, 5:11 AM IST

అమెరికాకు చెందిన ప్రముఖ ఐటీ కంపెనీ స్ప్రింక్లర్ హైదరాబాద్‌లో తన నూతన కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈమేరకు యూఎస్​లో పర్యటిస్తున్న కేటీఆర్ బృందం న్యూయార్క్‌లో కంపెనీ ప్రతినిధులను కలిసిన సందర్భంగా వెల్లడించింది. హైదరాబాద్‌లో నూతన ఐటీ కార్యాలయం ద్వారా వెయ్యి మందికి ఐటీ ఉద్యోగులకు ఉపాధి లభించనుంది.

అమెరికాలోని న్యూయార్క్‌లో మంత్రి కేటీఆర్‌తో సంస్థ ఛైర్మన్‌ ర్యాగి థామస్‌ శనివారం భేటీ అయ్యారు. 2009లో ఏర్పాటైన తమ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 25 దేశాల్లో, 3,700 మంది ఉద్యోగులతో పనిచేస్తోందన్నారు. సంస్థ విస్తరణలో భాగంగా హైదరాబాద్‌ను ఎంచుకున్నామని తెలిపారు. ఈ నిర్ణయంపై మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తంచేశారు. అమెరికా పర్యటనలో భాగంగా మంత్రి ఔషధ దిగ్గజ సంస్థలైన ఫైజర్‌, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌, గ్లాక్సోస్మిత్‌ క్లైన్‌ల ప్రతినిధులతో విడివిడిగా భేటీ అయ్యారు. ఈ మూడు సంస్థల ప్రధాన కార్యాలయాలను సందర్శించారు. ముందుగా ఫైజర్‌ సీఈవో, ఛైర్మన్‌ ఆల్బర్ట్‌ బౌర్లా, కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు, సీజీఎస్‌వో (చీఫ్‌ గ్లోబల్‌ సప్లై ఆఫీసర్‌) మైక్‌ మెక్‌డెర్మట్‌తో సమావేశమయ్యారు. తెలంగాణలో సంస్థను విస్తరించాలని కోరారు. ఆ తర్వాత జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు, మథాయ్‌ మమ్మన్‌తో మంత్రి భేటీ అయ్యారు. ఔషధనగరి గురించి వివరించారు. గ్లాక్సో స్మిత్‌క్లైన్‌ సీనియర్‌ ఉపాధ్యక్షుడు, ముఖ్య సాంకేతిక అధికారి ఆగమ్‌ ఉపాధ్యాయను కలిశారు. రాష్ట్రంలో విస్తరిస్తున్న ఔషధరంగ పరిశ్రమలో భాగస్వామి కావాలని కోరారు.

ఔషధనగరి ప్రారంభోత్సవానికి రావాలని, వచ్చే ఫిబ్రవరిలో జరిగే 20వ బయోఆసియా అంతర్జాతీయ సదస్సులో పాల్గొనాలని కోరగా.. ఆయన అంగీకరించారు. న్యూజెర్సీలో ఐటీ సర్వ్‌ అలయన్స్‌ నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రవాస భారతీయులు తెలంగాణలో పెట్టుబడులకు ముందుకు రావాలని కోరారు. కేంద్రం సహకరించపోయినా కేసీఆర్‌ ఆధ్వర్యంలో రాష్ట్రం ప్రగతిపథంలో పయనిస్తోందన్నారు. ‘మన ఊరు - మన బడి’ వంటి సామాజిక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ భారతీయ రేడియేషన్‌ ఆంకాలజిస్ట్‌ డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడిని మంత్రి కేటీఆర్‌ సత్కరించారు. మంత్రి వెంట ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌, సీఆర్‌వో అమర్‌నాథ్‌రెడ్డి ఉన్నారు.

న్యూయార్క్‌ వీధిలో... చికెన్‌ రైస్‌ భోజనం

విద్యార్థిగా, ఉద్యోగిగా న్యూయార్క్‌లో గతకాలపు స్మృతులను మంత్రి కేటీరామారావు గుర్తుకు తెచ్చుకున్నారు. ఫైజర్‌ ప్రతినిధుల సమావేశ అనంతరం న్యూయార్క్‌ వీధుల్లో నడుచుకుంటూ జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కార్యాలయానికి బయల్దేరారు. లెక్సింగ్టన్‌, 34 అవెన్యూలోని స్ట్రీట్‌ ఫుడ్‌ సెంటర్‌ వద్దకు వెళ్లి తనకు అత్యంత ఇష్టమైన వేడివేడి సాస్‌తో కూడిన చికెన్‌రైస్‌ని కొనుగోలు చేసి తిన్నారు. కేటీఆర్‌ అమెరికాలో ఒక సామాన్య వ్యక్తిలా వరుసలో నిలుచొని, డబ్బు చెల్లించి తన ఆహారం కొనుక్కొని.. క్యాబ్‌లో సమావేశానికి వెళ్లారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.