భూమికి సంబంధించిన పనులు వీఆర్వోల ద్వారా చేయించడం సరికాదని రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం నేతలు అన్నారు. కలెక్టర్ల ఆలోచన మార్చుకోవాలని డిమాండ్ చేశారు. వీఆర్వో పోస్టులు రద్దయి 5నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఒక్క కలెక్టర్.. ప్రభుత్వానికి నివేదిక ఇవ్వకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తమపై తహసీల్దార్ల ఒత్తిడి మానుకోవాలని కోరారు. ఏ హోదాతో భూ సంబంధిత పనులు చేయమంటారని నిలదీశారు.
సీఎస్ వద్దంటారు..
భూమికి సంబంధించిన పనులు సీఎస్ వద్దంటారని.. కలెక్టర్లు చేయమంటారని తెలిపారు. ఈ అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుండా తమని ఇబ్బందులకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
వీఆర్వోలకు సీనియర్ అసిస్టెంట్ ప్రమోషన్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. పీఆర్సీలో అందరికీ సీనియర్ అసిస్టెంట్ పే స్కేల్ మంజూరు చేయాలని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: గతంలో అనిశాకు చిక్కి... ఇప్పుడు వారికే పట్టించి