వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకంలో భాగంగా ఎల్బీ నగర్ జోన్లో రూ.448 కోట్లతో 10 ఫ్లై ఓవర్లు, 2 అండర్ పాసుల నిర్మాణాలు చేపట్టారు. రెండో ప్యాకేజీలో భాగంగా నిర్మించిన ఎల్బీ నగర్ జంక్షన్‌లోని రింగ్‌రోడ్ అండర్ పాస్, కామినేని జంక్షన్ ఫ్లై ఓవర్ (కుడివైపు)ను మంత్రి కేటీఆర్ గురువారం ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఎల్బీ నగర్‌లోని చింతలకుంట అండర్‌పాస్, కామినేని ఫ్లై ఓవర్ (ఎడమవైపు), ఎల్బీనగర్ పైవంతెనపై రాకపోకలు సాగుతున్నాయి.
కామినేని కుడివైపు పైవంతెన
రూ.43 కోట్ల వ్యయంతో పొడవు 940 మీటర్లు, వెడల్పు 12 మీటర్లుతో మూడ లైన్ల దారి ఉండేలా కామినేని కుడివైపు పైవంతెన నిర్మాణం చేపట్టారు. తద్వారా నాగోల్ నుంచి ఎల్బీ నగర్ వైపు వెళ్లే వాహనదారులకు ఎన్నోరోజులుగా ఉన్న ట్రాఫిక్ ఇక్కట్లు తీరనున్నాయి.
ఎల్బీ నగర్ రింగ్ రోడ్డు అండర్ పాస్
రూ. 14 కోట్లు వ్యయంతో పొడవు 519 మీటర్లు, 12.25 మీటర్ల వెడల్పుతో ఎల్బీ నగర్ రింగ్ రోడ్డు అండర్ పాస్‌ను నిర్మించారు. ఫలితంగా సాగర్ రింగ్ రోడ్డు నుంచి నాగోల్ వైపు వెళ్లే ప్రయాణికులకు మార్గం సులభతరం కానుంది. ఏన్నో రోజులుగా ఎల్బీ నగర్లో ఉన్న ట్రాఫిక్ జాం సమస్య తీరనుంది.
ఇదీ చూడండి: జయలలిత ఆస్తులకు వారసులు వారే