ETV Bharat / state

mla sudheer reddy: వరదలో చిక్కుకున్న ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కారు - కారు తోసిన ఎమ్మెల్యే సుధీర్​ రెడ్డి

mla sudheer reddy car strucked in flood water
ఎమ్మెల్యే కారు
author img

By

Published : Jul 15, 2021, 11:26 AM IST

Updated : Jul 15, 2021, 12:17 PM IST

11:23 July 15

వరదలో చిక్కుకున్న ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కారు

వరదలో చిక్కుకున్న కారు

వరదల్లో చిక్కుకున్న ముంపు ప్రాంతాలను పరిశీలించేందుకు ఎమ్మెల్యే సుధీర్​ రెడ్డి వెళ్లారు. హైదరాబాద్‌ ఎల్బీనగర్‌ పరిధిలోని సాగర్​ ఎన్​క్లేవ్​ కాలనీలో ప్రజలతో మాట్లాడారు. వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అక్కడ నుంచి మరో ప్రాంతానికి బయలుదేరారు. అప్పటివరకు బాగానే ఉన్నా... అప్పుడే వరద ప్రభావం పెరిగింది. కారులో  ప్రయాణిస్తున్న ఎమ్మెల్యే పర్యటనకు బ్రేక్​ పడింది. 

వరదలో కారు చిక్కుకుపోయిందని గమనించిన ఎమ్మెల్యే... వాహనం దిగారు. సెక్యూరిటీ సిబ్బందితో కలిసి కారును తోశారు. అయినా కారు ముందుకు పోలేదు. ఎమ్మెల్యే కష్టం చూసి.. అక్కడ ఉన్న స్థానికులు ఆయనకు సహాయం చేశారు. తలో చెయ్యి వేసి వాహనాన్ని ముందుకు నెట్టారు. కారు ప్రారంభమవ్వగానే... సుధీర్ రెడ్డి స్థానికులకు ధన్యావాదాలు తెలిపారు. బయటకు వచ్చిన వాహనంలో మళ్లీ ఎమ్మెల్యే ముంపు ప్రాంతాల్లో  పర్యటన కొనసాగించారు. 

ఇదీ చూడండి: Flash Floods: భారీవర్షంతో నీటమునిగిన కాలనీలు.. ఇళ్లలోకి చేరిన నీరు..

Last Updated : Jul 15, 2021, 12:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.