మళ్లీ రామరాజ్యం రాబోతోందని, సింహం సింగిల్‌గానే వస్తుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ హైదరాబాద్ నాంపల్లి పార్టీ కార్యాలయంలో పేర్కొన్నారు. నిన్నటి ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలే అందుకు నిదర్శనమని స్పష్టం చేశారు. నిన్నటి వరకు కత్తులు దూసుకున్న పార్టీలు ఈరోజు మోదీపై గెలవాలని కలిసిపోయాయని విమర్శించారు. మోదీ ప్రధాని అయితే తిన్న అవినీతి సొమ్ము కక్కిస్తారనే వారి భయమని అభిప్రాయపడ్డారు. భాజపా స్వతహాగానే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: జన చైతన్యం... కబ్జాపై ఉక్కుపాదం