Laxman fire on KCR: తెరాస పాలన పట్ల ప్రజలు విసిగిపోయారని భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. 2018 ఎన్నికల అనంతరం తెరాసకు స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటకీ 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఫిరాయింపులకు పాల్పడ్డారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఫిరాయింపులకు పెట్టింది పేరు తెరాస, కేసీఆర్ అంటూ విమర్శలు గుప్పించారు.
ఫిరాయింపుల చరిత్ర ఉన్న తెరాస.. భాజపాపై నిందలు వేస్తే నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని లక్ష్మణ్ తెలిపారు. ఇతర పార్టీల నుంచి వచ్చే వారిని రాజీనామా చేయించి.. తమ గుర్తుపై ఎమ్మెల్యేగా ఎన్నుకునే సంప్రదాయం భాజపాకు ఉందని తెలిపారు. మునుగోడులో ఓడిపోతామనే భయంతోనే కేసీఆర్ కొత్త నాటకానికి తెరతీసారని ఆరోపించారు.
"తెరాస పాలన పట్ల ప్రజలు విసిగిపోయారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన చరిత్ర తెరాసది. 2018 ఎన్నికల అనంతరం తెరాసకు స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటకీ 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఫిరాయింపులకు పాల్పడ్డారు. మునుగోడు ఓటమి భయంతోనే కొత్త నాటకమాడుతున్నారు".- లక్ష్మణ్, భాజపా నేత
ఇవీ చదవండి: