ఇంటర్ ఫలితాల్లో అవకతవకల వల్ల ఎంతో మంది విద్యార్థులు జాతీయ స్థాయి పరీక్షలకు అనర్హులుగా మిగిలారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం పరీక్షలు నిర్వహించడంలో విఫలమై ఇంటర్మీడియట్ సిస్టమ్‌నే ఎత్తివేసి సీబీఎస్సీ తరహాలో తీసుకొస్తామనడం సమంజసం కాదని మండిపడ్డారు. మరో రెండ్రోజుల్లో రానున్న పదో తరగతి ఫలితాల్లోనూ తప్పులు దొర్లాయనే సమాచారం వార్తాపత్రికల్లో వచ్చిందన్నారు. ఇప్పటికైన తగిన జాగ్రత్తలు తీసుకుని ఫలితాలు వెల్లడించాలని ప్రభుత్వానికి లక్ష్మణ్ సూచించారు.
ఇదీ చూడండి : లంకలో భీకర పోరు- 15 మంది మృతి