ETV Bharat / state

గచ్చిబౌలిలో డ్రైవ్ త్రూ కొవిడ్ టెస్టింగ్​ సెంటర్ ప్రారంభం - drive through covid testing center near by airport

ఆన్​లైన్​లో పేరు నమోదు చేసుకొని ఓ గుర్తింపు కార్డుతో వెళ్తే... మీ వాహనం వద్దకే వచ్చి కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. ఫలితాలను కూడా ఆన్​లైన్​లోనే తెలియపరుస్తారు. ఇది 24/7 పనిచేస్తుంది.

drive through covid test center
గచ్చిబౌలిలో డ్రైవ్ త్రూ కొవిడ్ టెస్టింగ్​ సెంటర్ ప్రారంభం
author img

By

Published : May 22, 2021, 9:40 AM IST

కొవిడ్‌ పరీక్షల కోసం భారతీయ జీవోమిక్స్‌ సంస్థ మ్యాప్​మైజీనోయమ్‌, సైయంట్‌ ఫౌండేషన్‌ డ్రైవ్‌ త్రూ కొవిడ్‌ టెస్టింగ్‌ను అందుబాటులోకి తెచ్చింది. గచ్చిబౌలిలోని జడ్పీ హైస్కూల్‌ అవరణలో ఈ కేంద్రాన్ని ప్రారంభించింది. కరోనా పరీక్షలు చేసుకునే వారు తమ పేర్లను ఆన్‌లైన్‌ ద్వారా ... లేదా అక్కడ ఏర్పాటు చేసిన బార్‌కోడ్‌ పోస్టర్ల ద్వారా నమోదు చేసుకొచ్చని ఈ సంస్థ సీఈఓ అనూ ఆచార్య తెలిపారు. టెస్ట్​ ఫీజు ఆన్‌లైన్‌ ద్వారా లేదా, ఎగ్జిక్యూటివ్‌కు చెల్లించవచ్చన్నారు. పరీక్ష రిపోర్టులు ఆన్‌లైన్‌ ద్వారా వినియోగదారులకు అందజేస్తామన్నారు.

కొవిడ్‌ పరీక్షలు చేయించుకునే టెస్ట్ సెంటర్​ వద్దకు వాహనంలో వెళ్తే... తమ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ వాహనం వద్దకు వచ్చి పరీక్ష నమూనాలను సేకరిస్తారన్నారు. అదే విధంగా గుర్తింపు కార్డు తప్పనిసరని తెలిపారు. కరోనా పరీక్షల కోసం తమ సంస్థకు రెండు ల్యాబ్‌లు ఉన్నాయని...ఒకటి మాదాపూర్‌లోనూ, మరొకటి అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఉన్నాయని చెప్పారు. ఈ ల్యాబ్స్‌ 24/7 పని చేస్తాయని తెలిపారు. డ్రైవ్‌ త్రూ టెస్టింగ్‌ కేంద్ర ద్వారా వినియోగదారులకు సరక్షితంతో పాటు క్యూలో నిలబడవల్సిన అసవరం లేదన్నారు.

ఇదీ చదవండి: అనాథలైన అక్కాచెల్లెల్లు... సాయం కోసం కన్నీళ్లతో ఎదురుచూపులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.