రాష్ట్రంలో కరోనా కేసులపై వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 731 మందికి కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయింది. వీటితో కలిపి మెుత్తం కేసుల సంఖ్య 6,29,785కు చేరింది. మహమ్మారి బారిన పడి మరో నలుగురు మృతి చెందగా.. మరణాల సంఖ్య 3,714కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 11,206 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.
ఇదీ చదవండి: వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఆవిర్భావ సభలో ప్రత్యేక ఆకర్షణగా లేజర్‌షో