నేటితో తొలిదశలో ఎన్నికలు జరగనున్న లోక్సభ నియోజకవర్గాలకు నామపత్రాల దాఖలు గడువు ముగియనుంది. ఈనెల 18న ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆరోజు నుంచే నామపత్రాల స్వీకరణ ప్రారంభమైంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 220 నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ లోక్సభ స్థానానికి 61 నామపత్రాలు వచ్చాయి. చివరి రోజు కావడం వల్ల అభ్యర్థులు పెద్దసంఖ్యలో నామినేషన్లు సమర్పించే అవకాశాలున్నాయి.రేపటి నుంచి పరిశీలన...
ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. రేపు నామపత్రాల పరిశీలన చేపడతారు. ఉపసంహరణకు ఈనెల 28 వరకు గడువు ఉంది. అందరిలో ఆసక్తి రేపిన నిజామాబాద్ లోక్సభ స్థానానికి ఇప్పటికే అత్యధికంగా 61 నామినేషన్లు రాగా... మరికొంత మంది రైతులు నామపత్రాలు దాఖలు చేసే అవకాశముంది. తెజస, తెతెదేపా ఒక్క నామినేషన్ కూడా వేయలేదు. ఇతర పార్టీల్లో మిగిలిన అభ్యర్థులు కూడా నామపత్రాలు దాఖలు చేసే అవకాశముంది.
ఇవీ చూడండి:దేశంలో ఉన్నది ఒక్కటే చక్రం.. అదే మోదీ మంత్రం!