ETV Bharat / state

'ఆర్థిక సహాయం కోసం జర్నలిస్టులు దరఖాస్తు చేసుకోవాలి' - రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ

జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి మంజూరు చేసే ఆర్థిక సహాయం పొందడానికి అక్టోబర్​ 5 లోపు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ పేర్కొన్నారు. గతంలో జర్నలిస్టుల సంక్షేమ నిధికి దరఖాస్తు చేసుకున్నవారు.. మళ్లీ చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు.

last date for applying to  Journalists' Welfare Fund
'ఆర్థిక సహాయం కోసం జర్నలిస్టులు దరఖాస్తు చేసుకోవాలి'
author img

By

Published : Sep 23, 2020, 8:39 PM IST

జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి మంజూరు చేసే ఆర్థిక సహాయం పొందడానికి అక్టోబర్​ 5 లోపు అర్హత గల జర్నలిస్టులు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. 2014, జూన్​ 2 తర్వాత మరణించిన జర్నలిస్టులకు సంబంధించిన కుటుంబీకులు, జర్నలిస్టు వృత్తిలో ఉంటూ అనారోగ్య బారిన పడి పనిచేయలేని స్థితిలో ఉన్న వారు మాత్రమే ఈ ఆర్థిక సహాయానికి దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

గతంలో జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి లబ్ధిపొందిన వారు, ఇప్పటికే మీడియా అకాడమీకి దరఖాస్తులు పంపినవారు.. మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని నారాయణ పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత పౌర సంబంధాల అధికారులైన ఉప సంచాలకులు, సహాయ సంచాలకులు, డీపీఆర్వోల ద్వారా ధ్రువీకరించిన దరఖాస్తులను మీడియా అకాడమీ కార్యాలయానికి పంపించాలని ఆయన కోరారు. ఇతర వివరాలకు కార్యాలయ ఫోన్ నంబర్ 040-23298672, 23298674కు సంప్రదించాలన్నారు.

దరఖాస్తు చేయాల్సిన అడ్రస్

  • తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ కార్యదర్శి
  • చిరునామా: ఇంటి నెం.10-2-1, సమాచార భవన్, 2వ అంతస్తు, ఎ.సి. గార్డ్స్, మాసబ్ ట్యాంక్, తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ కాంప్లెక్స్, హైదరాబాద్

ఇదీ చదవండిః దారిలేక వాగు దాటేందుకు 2 గంటలు గర్భిణీ నరకయాతన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.