ETV Bharat / state

తొమ్మిది జిల్లాల్లో రైతు వేదికలకు భూముల కేటాయింపు

author img

By

Published : Aug 7, 2020, 5:27 PM IST

రైతు వేదికల నిర్మాణాల కోసం తొమ్మిది జిల్లాల్లో భూములు కేటాయిస్తూ వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి జనార్దన్​రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. దసరాలోపల అన్ని హంగులతో సర్వాంగ సుందరంగా రైతు వేదికల నిర్మాణాలు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

RYTHU_VEDIKA
తొమ్మిది జిల్లాల్లో రైతు వేదికలకు భూముల కేటాయింపు

రాష్ట్రంలో రైతు వేదికల నిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. తాజాగా కొన్ని వ్యవసాయ క్లస్టర్ల పరిధిలో స్థలాలను కేటాయించింది. తొమ్మిది జిల్లాల్లో 10 వ్యవసాయ మార్కెట్ యార్డుల ప్రాంగణాల్లో రైతు వేదికల నిర్మాణానికి అవసరమైన భూమి కేటాయింపులు, కొనుగోళ్లు చేపట్టింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ బి.జనార్దన్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు.

ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ వ్యవసాయ మార్కెట్ యార్డులో 20 గుంటల భూమి కొనుగోలు చేసింది. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట, జన్నారం వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణాల్లో 20 గుంటలు చొప్పున కొనుగోలు చేసిన భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా రాచర్ల బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో 5 గుంటలు, నల్గొండ జిల్లా నకిరేకల్ మార్కెట్ యార్డులో 15 గుంటల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది.

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో 20 గుంటలు, వరంగల్ గ్రామీణ జిల్లా పరకాల మార్కెట్ యార్డులో 15 గుంటలు, జగిత్యాల జిల్లా పెగడపల్లి మార్కెట్‌ యార్డులో 15 గుంటలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మార్కెట్ యార్డులో 19 గుంటల చొప్పున స్థలాలు కేటాయించింది. క్షేత్రస్థాయి రైతుల ప్రయోజనాల కోసం ఒక్కో క్లస్టర్‌ పరిధిలో వ్యవసాయ శాఖ, గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు రూ. 22 లక్షల వ్యయంతో చేపట్టనున్న రైతువేదికల నిర్మాణం కోసం భూములు కొనుగోళ్లు, కేటాయింపులు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

దసరాలోపల అన్ని హంగులతో సర్వాంగ సుందరంగా రైతు వేదికల నిర్మాణాలు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వ్యవసాయ శాఖ ప్రకటించింది.

ఇవీచూడండి: సంక్షేమ పథకాల అమలులో దేశానికే తెలంగాణ ఆదర్శం : తలసాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.