లంబాడోళ్ల తడాఖా బహిరంగ సభ ప్రచార రథయాత్ర హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీకి చేరింది. ఈ సందర్భంగా రథయాత్రకు బంజారా భేరీ విద్యార్థి సంఘం నాయకులు నాము నాయక్ ఘనస్వాగతం పలికారు.
డిసెంబర్ 8న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ ఆదివాసి లంబాడోళ్ల తడాఖా మహాసభ ఉంటుందని సభ ప్రతినిధులు తెలిపారు. 40 లక్షల జనాభా ఉన్న గిరిజనులను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని గోండు వర్గం చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టేందుకు ఈ మహాసభను ఏర్పాటు చేస్తున్నట్టు వారు తెలిపారు. మహాసభను విజయవంతం చేయడానికి.. గిరిజనులను చైతన్యం చేస్తూ ఈ రథయాత్ర అన్ని జిల్లాల్లో జరుగుతుందని వారు తెలిపారు.
ఇదీ చూడండి: రాజకీయ నాయకులుగా మారిన విద్యార్థులు