ETV Bharat / state

లోపించిన పారిశుద్ధ్యం.. ఆకస్మిక తనిఖీల్లో బట్టబయలు - మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య చర్యలు

పారిశుద్ధ్య నిర్వహణ కోసం కొన్ని పట్టణాల్లో సమగ్ర ప్రణాళికలు లేకపోవడం ఇబ్బందిగా మారింది. పురపాలకశాఖ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేసిన 13 పురపాలికల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తనిఖీల్లో భాగంగా గుర్తించిన లోటుపాట్లను, సాధించిన ప్రగతిని అధికారులు ప్రస్తావించారు. పారిశుద్ధ్య లక్ష్యాలు నెరవేర్చేందుకు అవసరమైన సూచనలు చేశారు.

లోపించిన పారిశుద్ధ్యం... ఆకస్మిక తనిఖీల్లో వెలుగుచూసిన లోటుపాట్లు

author img

By

Published : Jan 20, 2021, 12:48 PM IST

హైదరాబాద్​ నగర, పురపాలికల్లో పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ సహా సంబంధిత కార్యక్రమాల అమలు, తీరుతెన్నులు పరిశీలించేందుకు పురపాలకశాఖ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. పారిశుద్ధ్య విభాగాన్ని పర్యవేక్షిస్తున్న అదనపు సంచాలకులు గత నెల చివరి వారంలో మూడు రోజుల పాటు నాగారం, దమ్మాయిగూడ, ఘట్ కేసర్, పోచారం, మేడ్చల్, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, దుండిగల్, నిజాంపేట, బొల్లారం, అమీన్​పూర్, తెల్లాపూర్, శంషాబాద్ పట్టణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా పట్టణాల్లో పారిశుద్ధ్య, వ్యర్థాల నిర్వహణను పరిశీలించి.. లోటుపాట్లతో పాటు అవలంభిస్తున్న విధానాలను గుర్తించారు.

లోపించిన పారిశుద్ధ్యం... ఆకస్మిక తనిఖీల్లో వెలుగుచూసిన లోటుపాట్లు
లోపించిన పారిశుద్ధ్యం... ఆకస్మిక తనిఖీల్లో వెలుగుచూసిన లోటుపాట్లు
లోపించిన పారిశుద్ధ్యం... ఆకస్మిక తనిఖీల్లో వెలుగుచూసిన లోటుపాట్లు
లోపించిన పారిశుద్ధ్యం... ఆకస్మిక తనిఖీల్లో వెలుగుచూసిన లోటుపాట్లు

లోపాలు ఇవి...

  • 13 పట్టణాల్లోనూ పారిశుద్ధ్య ప్రణాళికలు లేవు.
  • సమర్థ పారిశుద్ధ్య నిర్వహణపై అవగాహన లోపం.
  • చెత్త సేకరణకు వినియోగిస్తున్న ప్రైవేట్ వాహనాలపై మున్సిపల్ అధికారుల నియంత్రణ కొరవడింది.
  • ఎక్కడా తడి, పొడి చెత్తను వేరుగా సేకరించడం లేదు.
  • శంషాబాద్ మినహా మిగతా చోట్ల చెత్త వాహనాల్లోనూ విడిగా ఎలాంటి కంపార్ట్​మెంట్​లు లేవు.
  • పలు ప్రాంతాల్లో వాహనాలకు జీపీఎస్​ విధానం లేదు.
  • వాణిజ్య ప్రాంతాల నుంచి డోర్ టు డోర్ చెత్త సేకరించడం లేదు.
  • ఎక్కడా రెండు బుట్టల విధానాన్ని అమలు చేయడం లేదు.
  • మేడ్చల్ మినహా అన్ని ప్రాంతాల్లోను చోట్ల డంప్ యార్డులు, డీఆర్సీసీ కేంద్రాలు బాగా లేవు.
  • ఖాళీ ప్లాట్లు, స్థలాల్లో చెత్త పేరుకుపోయింది.
  • నిజాంపేట, తెల్లాపూర్​లో ఫ్లెక్సీలు ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి.
  • చాలా చోట్ల సిబ్బంది కొరత... ఉన్న సిబ్బందికి మాన్యువల్ విధానంలో వేతనాల చెల్లింపు.
  • పారిశుద్ధ్య కార్యక్రమాలపై నిత్యం కొరవడిన పర్యవేక్షణ.
  • సమగ్ర నిర్వహణ కోసం సిబ్బంది, వాహనాలను సక్రమంగా వినియోగించడం లేదు.

ఇవి బాగున్నాయి..

  • అన్ని పట్టణాల్లోనూ ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్లు, షీ టాయిలెట్ల నిర్వహణ బాగుంది.
  • మేడ్చల్ మున్సిపాలిటీలో డంప్ యార్డ్, కొంపల్లిలో డీఆర్సీసీ నిర్వహణ బాగుంది.
  • శంషాబాద్ మున్సిపాలిటీలో వ్యర్థాలనిర్వహణపై అవగాహన కల్పించేలా ఏర్పాటు చేసిన నగరదీపికల విధానం ప్రశంసనీయం
  • అమీన్ పూర్, శంషాబాద్ మున్సిపాలిటీలలో పురోగతి ఉంది.

ఇవి చేపట్టాలి..

అన్ని పట్టణాలకు పారిశుద్ధ్య ప్రణాళిక రూపొందించాలని... నెల వారీ లక్ష్యాలు విధించుకొని పనిచేయాలని అధికారులు సూచించారు. ఇంటి వద్దే తడి, పొడి చెత్త వేరు చేయాలని, వార్డుల వారీ అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. వాణిజ్యప్రాంతాల్లో చెత్త సేకరణ, తరలింపుపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని పేర్కొన్నారు. డీఆర్సీసీలు, డంప్ యార్డులు బాగా పనిచేసేలా చూడాలని తెలిపారు. పట్టణప్రగతి నిధుల నుంచి వీలైనంత ఎక్కువ మొత్తాన్ని ప్రత్యేకంగా పారిశుద్ధ్య నిర్వహణ కోసం కేటాయించాలన్నారు. పురపాలక అధికారులు, ఇంజినీర్లు, శానిటరీ సూపర్ వైజర్లకు పారిశుద్ధ్య నిర్వహణపై అవగాహన కల్పించేలా ప్రత్యేక కోర్సు రూపొందించాలని సూచించారు. ఆకస్మిక తనిఖీలో తేలిన అంశాల ఆధారంగా తగిన చర్యలు తీసుకోవాలని, తక్షణమే నివేదిక పంపాలని మున్సిపల్ కమిషనర్లను పురపాలకశాఖ సంచాలకులు సత్యనారాయణ ఆదేశించారు. ఆయా పట్టణాల్లో అవలంభిస్తున్న ఉత్తమ విధానాలను పరిశీలించి అమలు చేయాలని తెలిపారు.

ఇదీ చూడండి: రాష్ట్ర ప్రభుత్వం వినూత్న ప్రయోగం... డయాగ్నోస్టిక్​ హబ్​కు శ్రీకారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.