మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల పరిధిలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూముల రక్షణకు అఖిలపక్ష నాయకులు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోరాటానికి తెదేపా మద్దతు ప్రకటించింది. నారాయణ రావు కాలువ వెంబడి బఫర్జోన్లో కట్టడాల తొలగించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ డిమాండ్ చేశారు.
భూముల రక్షణకు చేపడుతున్న ఆందోళన కార్యక్రమాలను టీపీసీసీ లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్ పాలడుగు అమరేందర్ రెడ్డి, మండల తెదేపా అధ్యక్షుడు సంజీవ్ గౌడ్ రమణకు వివరించారు. అఖిలపక్ష నాయకులు నిర్వహించే నిరసనలకు మద్దతు ఉంటుందని రమణ తెలిపారు.
ఇదీ చూడండి : ఆ యాప్ సాయంతో.. సులభంగా సరకు రవాణా