ETV Bharat / state

ఈ ప్రభుత్వం ఎన్ని రోజులుంటుందో చూస్తామని అనడం మంచిది కాదు : కూనంనేని

Kunamneni Comments on BRS Party : 'ఓడిపోవడం అనేది ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగం. ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో చూస్తాం,’అని అనడం మంచిది కాదని, కొత్త ప్రభుత్వానికి అందరూ సహకరించాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. పాత ప్రభుత్వం ఎందుకు విఫలమైందో కాంగ్రెస్‌ ప్రభుత్వం పరిశీలన చేసి పని చేయాల్సి ఉంటుందన్నారు. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా కూనంనేని మాట్లాడారు. ఈ సందర్భంగా కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు.

Kunamneni Speech in Telangana Assembly Sessions
Kunamneni Comments on BRS Party
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 16, 2023, 4:35 PM IST

Updated : Dec 16, 2023, 9:45 PM IST

Kunamneni Comments on BRS Party : రాజకీయ క్రీడలో గెలుపు, ఓటములు సహజం. ఓడిపోవడం అనేది ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగం కూడా అంతమాత్రాన కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఎంత కాలం ఉంటుందో చూస్తామనడం సరైంది కాదనీ కొత్తగూడెం సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కొత్త ప్రభుత్వానికి అందరూ సహకరించాలని ఆయన కోరారు. పాత ప్రభుత్వం ఎందుకు విఫలమైందో కాంగ్రెస్ ప్రభుత్వం పరిశీలన చేసి పని చేయాల్సి ఉంటుందని సూచించారు. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌(Governor Tamilisai) ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా కూనంనేని పలు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కొత్త ప్రభుత్వానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

Kunamneni Speech in Telangana Assembly Sessions : 2020లో 17 రోజులు, 2023లో 11 రోజులు మాత్రమే సభ నడిచిందన్న ఆయన ఈ దఫా అసెంబ్లీని ఎక్కువ రోజులు నిర్వహించేలా చూడాలని సభను కోరారు. నిర్మాణాత్మకంగా సభలో సభ్యులు మాట్లాడాలని, వాటిలోనూ సభ్యుల మాటలు ఆరోగ్యదాయకంగా ఉండాలని కూనంనేని ఆశించారు. వ్యక్తిగత దూషణకు వెళ్లకుండా సభను పక్కదారి పట్టించకుండా మాట్లాడాలని కోరారు.

ఈ ప్రభుత్వం ఎన్ని రోజులుంటుందో చూస్తామని అనడం మంచిది కాదు : కూనంనేని

ఫామ్‌ హౌస్‌ వడ్లపై విచారణకు సిద్ధమా : రేవంత్ రెడ్డి

అప్పుడే ప్రజా సమస్యలకు పెద్ద పీఠ వేయొచ్చని తన భావాన్ని వ్యక్తపరిచారు. దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి(YS Rajasekhar Reddy) ఆనాడు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చారని, జలయజ్ఞానికి నిధులు వాటంతట అవే సమకూరాయని తెలిపారు. హామీలు నెరవేర్చేందుకు డబ్బు ఇబ్బంది కాదని, కేంద్రం నుంచి రాష్ట్రానికి చాలా నిధులు రావాల్సి ఉందని’ అన్నారు.

దశాబ్ద కాలంపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయని అన్నారు. కొంత మంది సభ్యులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారన్నారు. పార్టీ మారిని ఎమ్మెల్యేలు ఈ ఎన్నికల్లో ఓటమి(BRS Defeat) చవి చూశారనీ గుర్తు చేశారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం సరైంది కాదన్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం వల్లే బీఆర్ఎస్ ఓటమి పాలయ్యిందని అన్నారు.

రాష్ట్ర ఆవిర్భావం తిరుగుబాటు నుంచే పుట్టుకొచ్చింది. ఆనాడు జరిగిన 19వ శతాబ్దం ఉద్యమం కూడా తిరుగుబాటు వల్లే వచ్చింది. అయినా సరే అన్నీ మరిచిపోయి, మరలా ఈ పదవులు, అధికారం శాస్వతమంగా ప్రవర్తించటం మంచిది కాదు. ఆ జాగ్రత్త తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీని మనవి చేస్తున్నాను. స్వేచ్ఛా తెలంగాణ ఏర్పటుకు అందరూ కలిసి పనిచేయాలి.-కూనంనేనిసాంబశివరావు, సీపీఐ ఎమ్మెల్యే

Telangana Assembly Sessions 2023 : ఉద్యమ పార్టీగా వచ్చిన భారత రాష్ట్ర సమితి ప్రజా స్వేచ్ఛను హరించందని కూనంనేని విమర్శించారు. గత ప్రభుత్వం కోదండరాం, రేవంత్ రెడ్డిని, కమ్యునిస్టులను హౌస్ అరెస్టులు చేశారనీ గుర్తు చేశారు. స్వేచ్చలేని జీవితాన్ని తెలంగాణ ప్రజలు అంగీకరించరనీ స్పష్టం చేశారు. పంజరం నుంచి బయటకు వచ్చినట్లు ప్రజలు భావిస్తున్నారన్నారు. 26 ప్రజా సంఘాలను గత ప్రభుత్వం నిషేధించిందని మండిపడ్డారు.

రేవంత్​ రెడ్డి వర్సెస్​ కేటీఆర్ - శాసనసభలో వాడీవే'ఢీ' చర్చ

గత ప్రభుత్వం దళితులకు మూడెకరాల భూమి, రెండు పడక గదుల ఇళ్లు(Double Bedroom Houses), దళిత బంధు, బీసీ బంధును విస్మరించిందని విమర్శించారు. కూనంనేని వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్​రావు స్పందించారు. ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని తాము ఎక్కడా చెప్పలేదన్నారు. తమ మేనిఫెస్టోలో ఎక్కడా పేర్కొనలేదని, ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని ఎక్కడ చెప్పామో చెప్పాలని సవాల్ విసిరారు.

మహేశ్వర్​ రెడ్డి వర్సెస్​ మంత్రులు - 'కాంగ్రెస్​ హామీలు నెరవేర్చేందుకు 100 రోజుల సమయం ఇస్తున్నాం'

అసెంబ్లీని ముట్టడించిన గిరిజనుల హక్కుల పోరాట సమితి సభ్యులు

Last Updated : Dec 16, 2023, 9:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.