గ్రేటర్ ఎన్నికల్లో ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ కార్పొరేటర్ టికెట్ ముద్దం నర్సింహయాదవ్కే కేటాయిస్తామని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని ఆకాంక్షించారు. డివిజన్లో చేసిన అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలు పరిష్కరించిన తీరును సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు వివరించాలని సూచించారు.
గతంలో ఓల్డ్ బోయిన్పల్లి ప్రజలు సమస్యలతో సతమతమవుతూ ఉండేవారని, తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత వారి సమస్యలు పరిష్కరించామని ఎమ్మెల్యే అన్నారు. ఇప్పటివరకు ప్రజలు తెరాసను ఆదరిస్తూ విజయాలందించారని, గ్రేటర్ ఎన్నికల్లోనూ గొప్ప మెజార్టీని అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.