ETV Bharat / state

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వైభవంగా అంకురార్పణ - శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సప్తగిరులు ముస్తాబయ్యాయి. ఉత్సవాలకు అకురార్పణ కార్యక్రమం వైభవంగా జరిగింది. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. మూడున్నర వేల మంది పోలీసులు... 1600 సీసీ కెమెరాలతో భద్రతా ఏర్పాట్లు చేశారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వైభవంగా అంకురార్పణ
author img

By

Published : Sep 30, 2019, 11:02 AM IST

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వైభవంగా అంకురార్పణ

అఖిలాండకోటి బ్రహ్మండనాయకుని వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమాన్ని ఆదివారం రాత్రి అర్చకులు వైభవంగా నిర్వహించారు. స్వామివారి సేనాధిపతి విశ్వక్సేనుడు ప్రదక్షణగా తిరువీధుల్లో ఊరేగుతూ తిరిగి ఆలయానికి చేరుకున్నారు. ఉత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించడానికే సేనాధిపతి ఉత్సవాన్ని నిర్వహించారు. ఆలయంలోని యాగశాలలో అంకురార్పణకు, వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ఇవాళ రాత్రి 8 గంటలకు పెద్ద శేషవాహన సేవలో వాహన సేవలు ప్రారంభమవుతాయి. తొమ్మిది రోజుల పాటు స్వామివారు వివిధ వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉత్సవాల్లో ప్రధానమైన గరుడ వాహన సేవ అక్టోబర్ నాలుగున నిర్వహిస్తారు. ఆఖరి రోజున శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నాన మహోత్సవం జరుగుతుంది. 5 గంటల 23 నిమిషాల నుంచి 6 గంటల మధ్య బ్రహ్మోత్సవాలకు ధ్వజావరోహనం నిర్వహిస్తారు.

దసరా సెలవుల్లో జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు వస్తారని భావిస్తున్న తితిదే... భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. తిరుమాడవీధుల్లో 2లక్షల మంది వేచిఉండే విధంగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. దొంగతనాలను అరికట్టేందుకు, పార్కింగ్‌ సమస్యలు తలెత్తకుండా ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

పార్కింగ్‌ ప్రాంతాలను, మార్గాన్ని గుర్తించేందుకు వీలుగా ప్రత్యేక యాప్​ను అందుబాటులో ఉంచారు. తితిదే నిఘా భద్రతా విభాగం, పోలీసులు కలసి సమన్వయంతో పనిచేయాలని తితిదే కార్యనిర్వహణాధికారి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ సూచనలు చేశారు. భక్తులకు సేవలు అందించడంలో సిబ్బంది సంయమనం పాటించాలని కోరారు.

ఇదీ చూడండి : రాష్ట్ర వ్యాప్తంగా కన్నుల పండువగా బతుకమ్మ వేడుకలు

Intro:ap_cdp_42_29_akattukunna_kolatam_avb_ap10041
place: proddatur
reporter: madhusudhan

కడపజిల్లా ప్రొద్దుటూరులో దసరా ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. వై.ఎం.ఆర్ కాలనీలోని రాజరాజేశ్వరి దేవి ఆలయంలో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. తొలిరోజు అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ఆవరణలో మహిళలు చేసిన కొలట నృత్యం అలరించింది. వివిధ భక్తి పాటలకు చేసిన కొలటం అందరినీ ఆకట్టుకుంది. ఆలయ నిర్వాహకులు కొలాట నృత్య శిక్షకుడు శ్రవణ్ ను సన్మానించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Body:ఆ

Conclusion:ఆ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.