హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్ రెడ్డిని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ఎమ్మెల్యేకు అందుతున్న వైద్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కేటీఆర్‌తోపాటు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, బాల్క సుమన్ ఉన్నారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మహేశ్వర్ రెడ్డి గాయపడిన విషయం తెలిసిందే.
ఇదీ చూడండి : భారత్ గురించే 30 నిమిషాల పాటు ట్రంప్ ప్రసంగం