ETV Bharat / state

మరో 3 నెలల్లో స్టీల్ బ్రిడ్జి పనులు పూర్తవ్వాలి.. అధికారులకు మంత్రి ఆదేశం - కేటీఆర్ హైదరాబాద్​లోని నిర్మాణాలకు ఆకస్మిక తనిఖీలు

KTR Inspected Steel Bridge Works In Hyderabad: ఎస్​ఆర్డీపీ ఫ్లై ఓవర్ల మాదిరిగా వీఎస్టీ-ఇందిరా పార్కు వద్ద నిర్మిస్తున్న స్టీల్​ బ్రిడ్జి కూడా అద్భుత నిర్మాణంగా మారబోతుందని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. స్టీల్​ బ్రిడ్జి నిర్మాణ పనులతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. తర్వాత హుస్సేన్ సాగర్ సర్పేస్ నాలా రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను పరిశీలించారు.

minister ktr
మంత్రి కేటీఆర్
author img

By

Published : Mar 4, 2023, 4:00 PM IST

KTR Inspected Steel Bridge Works In Hyderabad: సెంట్రల్ హైదరాబాద్ నగరానికి ప్రభుత్వం నిర్మిస్తున్న వీఎస్టీ-ఇందిరా పార్క్ వద్ద స్టీల్ బ్రిడ్జి తలమానికంగా మారబోతుందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో ఎమ్మెల్యే ముఠా గోపాల్, పలువురు అధికారులు పాల్గొన్నారు. ముందుగా ఇందిరాపార్క్ వద్ద నిర్మిస్తున్న స్టీల్​ బ్రిడ్జి పనుల పురోగతిని జీహెచ్​ఎంసీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

అనంతరం స్టీల్​బ్రిడ్జి నిర్మాణంపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ స్టీల్​బ్రిడ్జి పనులు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో మూడు నెలల్లో పనులు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఇందుకు అవసరమైన ట్రాఫిక్​ మళ్లింపులు వంటి అంశాల విషయంలో నగర ట్రాఫిక్ పోలీసు విభాగంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. మూడు నెలల్లోగా నిర్మాణం పూర్తి చేసేందుకు అవసరమైన అదనపు బృందాలను ఏర్పాటు చేసి.. నిర్మాణ పనులను వేగవంతం చేయాలని వర్కింగ్ ఏజెన్సీని ఆదేశించారు.

ఎస్​ఆర్డీపీ ఫ్లైఓవర్ల మాదిరిగా స్టీల్​బ్రిడ్జి అద్భుత నిర్మాణం: నిర్మాణ పనులను పరిశీలించుకుంటూ మంత్రి కేటీఆర్ వీఎస్టీ చేరుకున్నారు. అక్కడ దాదాపు పూర్తయిన ర్యాంపు పైనుంచి బ్రిడ్జి నిర్మాణ పనులను పర్యవేక్షించారు. ఇప్పటికే నగరంలో పూర్తయిన ఎస్​ఆర్డీపీ ఫ్లైఓవర్ల మాదిరిగా.. ఈ స్టీల్​బ్రిడ్జి సైతం అద్భుతమైన నిర్మాణంగా మారబోతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. 2.8 కిలోమీటర్ల పొడవైన నాలుగు వరుసల స్టీల్​బ్రిడ్జి కోసం జీహెచ్​ఎంసీ దాదాపు రూ.440 కోట్లను ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.

ఆర్టీసీ క్రాస్​ రోడ్డు వద్ద ట్రాఫిక్​ను తగ్గించి.. ముషీరాబాద్, ఖైరతాబాద్, అంబర్​పేట్ వంటి నియోజకవర్గాల ప్రజల సౌకర్యార్థం ఈ బ్రిడ్జి నిర్మాణం చేయాలనే డిమాండ్ రెండు దశాబ్దాలుగా ఉందని చెప్పారు. ఇంతటి కీలకమైన బ్రిడ్జి నిర్మాణం సత్వరంగా పూర్తి చేయాలన్న లక్ష్యంతోనే సాధారణ కాంక్రీట్ నిర్మాణం కాకుండా స్టీల్ బ్రిడ్జిగా నిర్మాణం చేస్తున్నామని వివరించారు. ఈ బ్రిడ్జి నిర్మాణం మూడు నెలల్లో పూర్తవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో నగర వాసులకు ట్రాఫిక్ కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు పరిశీలన: స్టీల్ ​బ్రిడ్జి నిర్మాణంతో పాటు ఎస్​ఎన్​డీపీ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పలు మౌలిక సదుపాయాల కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ పరిశీలించారు. హుస్సేన్​ సాగర్ సర్పేస్​ నాలాలో చేపడుతున్న పనులను సమీక్షించారు. అశోక్​నగర్ వద్ద కొనసాగుతున్న రిటైనింగ్ వాల్ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. వరద ప్రాంతాలను గుర్తించి.. వరద ప్రమాదాన్ని తగ్గించే విధంగా అనేక కార్యక్రమాలను చేపట్టినట్లు కేటీఆర్ తెలిపారు. హుస్సేన్ సాగర్ వరద ముంపునకు గురైనప్పుడు ఆ పరిసర లోతట్టు ప్రాంతాలు మునిగిపోకుండా సర్పేస్ నాలాలకు భారీ ఎత్తున నిధులు కేటాయించి.. రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నట్లు చెప్పారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.