KTR America Tour Updates : హైదరాబాద్ మహానగరం ప్రపంచానికి హెల్త్-టెక్-మక్కాగా అభివృద్ధి చెందుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగాల్లో డిజిటలైజేషన్ వినియోగం రోజురోజుకూ పెరుగుతోందని తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్.. వివిధ సంస్థల ప్రతినిధులతో పెట్టుబడుల విషయమై చర్చిస్తున్నారు. అందులో భాగంగా భాగ్యనగరంలో గ్లోబల్ కేపబిలిటీస్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సైంటిపిక్ క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థ క్లోవర్టెక్స్ ప్రకటించింది. మంత్రి కేటీఆర్‌తో సమావేశమైన అనంతరం ఆ సంస్థ సీఈఓ క్షితిజ్ కుమార్ ఈ మేరకు ప్రకటన చేశారు.
clovertex invests in Hyderabad : ఈ గ్లోబల్ కేపబిలిటీస్ సెంటర్ రూ.100 కోట్ల పెట్టుబడితో 100 నుంచి 150 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. అడ్వాన్స్డ్ బయో ఇన్ఫర్మెటిక్స్, బిగ్ డేటా అనలిటిక్స్ కోసం హైదరాబాద్ కేంద్రాన్ని అభివృద్ధి చేయనున్నారు. క్లోవర్టెక్స్ ప్రకటనపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. అమెరికా వెలుపల ఆ సంస్థ మొదటి కేంద్రం హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేయడం మంచి విశేషమన్నారు. లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగాల్లో డిజిటలైజేషన్ వినియోగం రోజురోజుకూ పెరుగుతోందన
State Street Invests in Hyderabad : హైదరాబాద్‌లో తమ సంస్థ కార్యకలాపాలను మరింత విస్తరించనున్నట్లు స్టేట్ స్ట్రీట్ సంస్థ ప్రకటించింది. బోస్టన్‌లో సంస్థ ప్రతినిధులతో సమావేశమైన సందర్భంగా మంత్రి కేటీఆర్‌కు ఈ మేరకు తెలిపారు. ఏడాదికి 40 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వనరులు ఉన్న సంస్థ స్టేట్ స్ట్రీట్ అని కేటీఆర్ వివరించారు. బ్యాంకింగ్ ఫైనాన్స్ అండ్ ఇన్యూరెన్స్ రంగంలో.. స్టేట్ స్ట్రీట్ దిగ్గజ సంస్థ అని కేటీఆర్ తెలిపారు.
బోస్టన్‌లో కేంద్ర కార్యాలయం తర్వాత.. హైదరాబాద్‌లో రెండో అతిపెద్ద కార్యాలయం ఏర్పాటు చేయడం గొప్ప విషయమని మంత్రి కేటీఆర్ వివరించారు. దీనిని మరింతవిస్తరించడం ద్వారా 5వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. సంస్థ కేవలం ఉద్యోగాలే కాకుండా.. కృత్రిమ మేధ అభివృద్ధి, డేటా ఎనలాటిక్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్, హెచ్‌ఆర్ తదితర సేవలను.. హైదరాబాద్ నుంచి నిర్వహించనుందని వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వంతో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఒప్పందం : హైదరాబాద్‌లో డెలివరీ సెంటర్ విస్తరిస్తామని గ్రిడ్ డైనమిక్స్ సంస్థ ప్రకరించింది. డేటా సెంటర్ అభివృద్ధికి 50 మిలియన్ డాలర్లను ఔరమ్ ఈక్విటీ సంస్థ కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వంతో యునివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఒప్పందం కుదుర్చుకొంది. తక్కువ ధరలో పర్యావరణహిత వాహనాలను అందించేందుకు ఒప్పందం జరిగింది.
ఇవీ చదవండి :