KTR Tweet on Revanth Reddy Comments : ఇప్పుడున్న రాజకీయ నేతలంతా ట్విటర్లో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటున్నారు. ఏదైనా సంఘటన జరిగితే చాలు వాటిని వెంటనే పోస్ట్ చేస్తున్నారు. ఇక రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అయితే ట్విటర్లో యమా యాక్టివ్. కేంద్రంపై విమర్శలు, ప్రజా సమస్యలతో పాటు రాష్ట్రాభివృద్ధి, ప్రతిపక్షాలను ఎండగట్టేందుకు ఆయన ట్విటర్‌ను వేదిక చేసుకుంటారు.
-
KCR గారి నినాదం...
— KTR (@KTRBRS) July 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
*" మూడు పంటలు "
*కాంగ్రెస్ విధానం...*
*" మూడు గంటలు "
BJP విధానం
“మతం పేరిట మంటలు”
*" మూడు పంటలు "* కావాలా..
*" మూడు గంటలు "* కావాలా..
“ మతం పేరిట మంటలు” కావాలా…
తెలంగాణ రైతు...
తేల్చుకోవాల్సిన..
తరుణం ఇది..!!
">KCR గారి నినాదం...
— KTR (@KTRBRS) July 12, 2023
*" మూడు పంటలు "
*కాంగ్రెస్ విధానం...*
*" మూడు గంటలు "
BJP విధానం
“మతం పేరిట మంటలు”
*" మూడు పంటలు "* కావాలా..
*" మూడు గంటలు "* కావాలా..
“ మతం పేరిట మంటలు” కావాలా…
తెలంగాణ రైతు...
తేల్చుకోవాల్సిన..
తరుణం ఇది..!!KCR గారి నినాదం...
— KTR (@KTRBRS) July 12, 2023
*" మూడు పంటలు "
*కాంగ్రెస్ విధానం...*
*" మూడు గంటలు "
BJP విధానం
“మతం పేరిట మంటలు”
*" మూడు పంటలు "* కావాలా..
*" మూడు గంటలు "* కావాలా..
“ మతం పేరిట మంటలు” కావాలా…
తెలంగాణ రైతు...
తేల్చుకోవాల్సిన..
తరుణం ఇది..!!
KTR Fires on congress : తాజాగా రేవంత్‌రెడ్డి ఉచిత విద్యుత్‌పై చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి ట్విటర్ వేదికగా మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ నోట రైతులకు.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయిందని తెలిపారు. అప్పట్లో 7 గంటల విద్యుత్ ఇవ్వకుండా ఎగ్గొట్టారన్న కేటీఆర్.. ఇవాళ ఉచిత్ కరెంట్‌కు ఎగనామం పెట్టే కుట్రలకు తెరతీశారని విమర్శించారు. పొలానికి 3 గంటల విద్యుత్ కోసం.. బాహుబలి మోటార్లు పెట్టాలన్న మంత్రి.. మరోసారి 3 గంటల మాటెత్తితే రైతుల చేతిలో మాడు పగలడం ఖాయమని ధ్వజమెత్తారు. అధికారంలోకి వస్తే ఇప్పటికే ధరణి తీసేస్తామని చెబుతున్నారని ట్విటర్ వేదికగా కాంగ్రెస్‌పై కేటీఆర్ ధ్వజమెత్తారు.
-
కాంగ్రెస్ నోట..
— KTR (@KTRBRS) July 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
రైతులకు రెండో ప్రమాద హెచ్చరిక.. !!
కాంగ్రెస్ వస్తే...
నిన్న ధరణి తీసేస్తం అన్నడు.. రాబందు
నేడు 3 గంటల కరెంట్ చాలు అంటున్నడు..
నాడు వ్యవసాయం దండగ అన్నడు చంద్రబాబు
నేడు మూడుపూటలు దండగ అంటున్నడు ఛోటా చంద్రబాబు
మూడు ఎకరాల రైతుకు..
మూడుపూటలా కరెంట్ ఎందుకు అనడం..…
">కాంగ్రెస్ నోట..
— KTR (@KTRBRS) July 12, 2023
రైతులకు రెండో ప్రమాద హెచ్చరిక.. !!
కాంగ్రెస్ వస్తే...
నిన్న ధరణి తీసేస్తం అన్నడు.. రాబందు
నేడు 3 గంటల కరెంట్ చాలు అంటున్నడు..
నాడు వ్యవసాయం దండగ అన్నడు చంద్రబాబు
నేడు మూడుపూటలు దండగ అంటున్నడు ఛోటా చంద్రబాబు
మూడు ఎకరాల రైతుకు..
మూడుపూటలా కరెంట్ ఎందుకు అనడం..…కాంగ్రెస్ నోట..
— KTR (@KTRBRS) July 12, 2023
రైతులకు రెండో ప్రమాద హెచ్చరిక.. !!
కాంగ్రెస్ వస్తే...
నిన్న ధరణి తీసేస్తం అన్నడు.. రాబందు
నేడు 3 గంటల కరెంట్ చాలు అంటున్నడు..
నాడు వ్యవసాయం దండగ అన్నడు చంద్రబాబు
నేడు మూడుపూటలు దండగ అంటున్నడు ఛోటా చంద్రబాబు
మూడు ఎకరాల రైతుకు..
మూడుపూటలా కరెంట్ ఎందుకు అనడం..…
- KTR Fires on Congress : '24 గంటల వెలుగులు వదులుకొని.. కాంగ్రెస్ చీకట్ల కాలాన్ని మళ్లీ తెచ్చుకుందామా'
BRS Fires On Revanth Comments : రైతుకు మూడుపూటలా కరెంట్ ఎందుకు అనడం.. ముమ్మాటికీ సన్న, చిన్నకారు రైతును అవమానించడమేనని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు చిన్నకారు రైతు అంటే చిన్నచూపు ఉందని విమర్శించారు. నోట్లు తప్ప రైతుల పాట్లు తెలవని రాబందును నమ్మవద్దన్న కేటీఆర్ .. వారిని నమ్మితే రైతు నోట్లో మట్టికొట్టడం ఖాయమని పేర్కొన్నారు. రైతన్నలకు ఇది పరీక్షా సమయమని.. రైతును రాజును చేసే మనసున్న సీఎం కేసీఆర్ కావాలా? .. 3 గంటల విద్యుత్ చాలన్న మోసకారి రాబందు కావాలా.. లేదా మతం పేరిట మంటలు రేపే బీజేపీ కావాలా.. రైతులే తేల్చుకోవాలని అన్నారు. 'కేసీఆర్ నినాదం.. మూడు పంటలు, కాంగ్రెస్ విధానం.. మూడు గంటలు, బీజేపీ విధానం.. మతం పేరిట మంటలు' అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
BRS Protest Against Revanth Reddy Comments : 'తెలంగాణలో 95 శాతం మంది రైతులకు 3 ఎకరాల్లోపు భూమి ఉన్నందున అందులో పంటల సాగుకు 3 గంటలసేపు కరెంటు ఇస్తే నీరందించవచ్చు. మొత్తంగా వ్యవసాయానికి రోజూ 8 గంటల సేపు విద్యుత్ చాలు' అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల గులాబీదళం కదం తొక్కింది. పార్టీ పిలుపు మేరకు రోడ్డెక్కిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు.. రేవంత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. రైతుల పట్ల కాంగ్రెస్‌కున్న చిత్తశుద్ధికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి వ్యాఖ్యలే నిదర్శనమని మంత్రులు పేర్కొన్నారు. కేసీఆర్ సర్కార్ నిరంతరం కరెంటు అందిస్తుంటే కాంగ్రెస్ కడుపు మండుతోందని.. ఆ పార్టీకి బుద్ధిచెప్పాలని బీఆర్ఎస్ పిలుపునిచ్చింది.
ఇవీ చదవండి:
- Free Current Controversy in Telangana : రేవంత్ వ్యాఖ్యల పట్ల... నిరసనల గళమెత్తిన గులాబీదళం
- Power war between BRS and Congress : కరెంట్ కయ్యం.. రాష్ట్రవ్యాప్తంగా సబ్ స్టేషన్ల ముందు నిరసనలకు పిలుపునిచ్చిన కాంగ్రెస్
- Revanth Reddy Tweet On Power : 'సత్యాగ్రహ దీక్షను నీరుగార్చేందుకే.. ఉచిత విద్యుత్ అంశం తెరపైకి'