ETV Bharat / state

KTR Today Tweet: 'తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా మార్చిన ఘనత కేసీఆర్‌దే'

KTR Tweet on Water Day : దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు 'ఇరిగేషన్‌ వాటర్‌ డే' ను పురస్కరించకుని తమ సర్కారు చేపట్టిన పలు విశేషాలను మంత్రులు కేటీఆర్‌, హరీశ్​రావు ట్విటర్‌లో పంచుకున్నారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా తీర్చిదిద్దిన ఘనత.... ముఖ్యమంత్రి కేసీఆర్‌దే అని కేటీఆర్ పునరుద్ఘాటించారు. నాడు ఎటు చూసినా తడారిన నేలలని... నేడు ఎటు చూసినా పరవళ్ళు తొక్కుతున్న గోదారి అని హరీశ్ రావు పేర్కొన్నారు.

KTR
KTR
author img

By

Published : Jun 7, 2023, 7:03 PM IST

KTR Tweet on Water Day in Decade Celebrations : దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సాగునీటి దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఊరూవాడ పండగ వాతావరణంలో నిర్వహించుకున్నారు. మండువేసవిలోనూ పంట కాల్వల్లో నీరు పారుతున్నాయంటే కేసీఆర్‌ సాగు దార్శనికతకు నిదర్శమని గులాబీ నేతలు కొనియాడారు. తొమ్మిదేళ్లలో కాళేశ్వరం సాకారం సహా సాగునీటి రంగంలో రాష్ట్రం సాధించిన విజయాలను వివిధ కార్యక్రమాల ద్వారా చాటిచెప్పారు. ఈ సందర్భంగా మంత్రులు కేటీఆర్, హరీశ్​రావులు సాగునీటి రంగంలో తమ సర్కార్ చేపట్టిన పలు విశేషాలను ట్విటర్​లో పంచుకున్నారు.

సాగునీటి రంగంలో స్వర్ణయుగం తీసుకొచ్చాం : తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా తీర్చిదిద్దిన ఘనత... ముఖ్యమంత్రి కేసీఆర్‌దే అని మంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు. బీఆర్​ఎస్ సర్కారు చేపట్టిన పలు ప్రాజెక్టుల విశేషాలను మంత్రి ట్విటర్‌లో పంచుకున్నారు. చుక్క నీటి కోసం అలమటించిన రోజుల నుంచి... తెలంగాణ సాగునీటి రంగంలో స్వర్ణయుగం తీసుకురాగలిగామన్నారు. తెలంగాణ జల విధానం.... దేశానికే ఆదర్శమని పేర్కొన్నారు. ఉమ్మడి పాలనలో రైతులు సంక్షోభం ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. కేసీఆర్ నిబద్ధతతో తెలంగాణ సాగునీటి రంగంలో స్వర్ణయుగం వచ్చిందన్న మంత్రి.. చుక్కనీటి కోసం అల్లాడిన నేలకు ప్రతినిత్యం జలాభిషేకం చేస్తున్నామంటూ హర్షం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చే వందేళ్ల వరకు ప్రజలకు సాగు నీటి కొరతను తీర్చిందన్న మంత్రి... త్వరలోనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. చిన్న నీటి పారుదల రంగానికీ కేసీఆర్ సర్కారు పెద్దపీట వేసిందన్న కేటీఆర్.... ఈ విషయంలో భాగస్వాములైన ఇంజినీర్లకు, శ్రామికులకు, నీటి పారుదల శాఖ ఉద్యోగులకు అభినందనలు తెలిపారు.

  • 💧🌊💧

    జలదృశ్యం నుంచి..
    సుజల దృశ్యం దాకా...

    తెలంగాణ జల విధానం..
    మన భారత దేశానికే కాదు..
    యావత్ ప్రపంచానికే ఆదర్శం

    నాడు...
    ఉమ్మడి పాలనలో
    తెలంగాణ వ్యవసాయ రంగంలో సంక్షోభం
    రైతన్నల బతుకు అత్యంత దుర్భరం

    నేడు...
    ఒకే ఒక్కడి సంకల్పంతో...
    సాగునీటి రంగంలో స్వర్ణయుగం…

    నాడు
    నా తెలంగాణ… pic.twitter.com/uNdQmb2jd9

    — KTR (@KTRBRS) June 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Harishrao Tweet on Water Day : నాడు ఎటు చూసినా తడారిన నేలలని... నేడు ఎటు చూసినా పరవళ్లు తొక్కుతున్న గోదారి అని ఆర్థిక మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సాగుదినోత్సవం జరుపుకుంటున్న వేళ మంత్రి హరీశ్​రావు... ట్విట్టర్ ద్వారా రాష్ట్ర నీటిపారుదల పురోగతిని వివరించారు. పేర్కొన్నారు. నాడు ఎటుచూసినా నోళ్లు తెరచిన బీళ్లు కనిపించేవని... నేడు తలలూపుతున్న ఆకుపచ్చని పైర్లు కనిపిస్తున్నాయని అన్నారు. ఇది తెలంగాణ జలవిజయం... కేసీఆర్ సాధించిన ఘన విజయమని హరీశ్ రావు అన్నారు. మండుటెండల్లో తడలు గొడుతున్న చెరువులు, ఊటలు జాలువారుతున్న వాగులు.. పాతళగంగమ్మ పైపైకి ఎగదన్నుతున్న జలదృశ్యాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఇది కదా జల తెలంగాణ... ఇది కదా కోటి రతనాల మాగాణ అని హరీశ్ రావు ట్వీట్ చేశారు.

  • నాడు ఎటు చూసినా తడారిన నేలలు..
    నేడు ఎటు చూసినా పరవళ్ళు తొక్కుతున్న గోదారి.

    నాడు ఎటుచూసినా నోళ్లు తెరచిన బీళ్లు..
    నేడు తలలూపుతున్న ఆకుపచ్చని పైర్లు.

    ఇది తెలంగాణ జలవిజయం..
    కేసీఆర్ సాధించిన ఘన విజయం.

    మండుటెండల్లో తడలు గొడుతున్న చెరువులు..
    ఊటలు జాలువారుతున్న వాగులు..
    పాతళగంగమ్మ… pic.twitter.com/R94ozLdR8A

    — Harish Rao Thanneeru (@BRSHarish) June 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.