KTR Today Tweet on Telangana Decade Celebrations : తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు రాష్ట్రవ్యాప్తంగా రైతు దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పలుచోట్ల ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో కర్షకులు ర్యాలీ నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లోని వ్యవసాయ మార్కెట్ యార్డులకు చేరుకుని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిని వివరిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
KTR Tweet on Farmers Day : నెర్రెలు బారిన ఈ నేల.. తొమ్మిదేళ్లలోనే దేశానికి ధాన్యాగారమైందంటే దానికి కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రైతు ప్రభుత్వమే అని కేటీఆర్ పేర్కొన్నారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని పథకాల వల్లే ఈ అద్భుతం సాధ్యమైందని తెలిపారు. రైతు బంధు పథకం ద్వారా 65 లక్షల మంది రైతులకు రూ.66 వేల కోట్లను పెట్టుబడి సాయంగా అందించిన ఏకైక ప్రభుత్వం బీఆర్‌ఎస్ ప్రభుత్వమని స్పష్టం చేశారు. రైతు బీమా ద్వారా ఒక్కో రైతుకు రూ.5 లక్షల చొప్పున లక్షా 782 రైతు కుటుంబాలకు మన ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.5,039 కోట్లు పరిహారంగా చెల్లించి ఆదుకుందని వివరించారు. ప్రతి దశలోనూ రైతుకు అండగా ఉండేందుకు 10,769 గ్రామాల్లో రైతుబంధు సమితుల ఏర్పాటు.. 27 లక్షల వ్యవసాయ మోటార్లకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్న తొలి రాష్ట్రం తెలంగాణ అని మంత్రి వెల్లడించారు.
-
🌾🌱🌴🌿
— KTR (@KTRBRS) June 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
వ్యవసాయం దండుగ అన్నచోటనే పండుగ అయ్యింది. నెర్రెలు బారిన ఈ నేల దశాబ్ది లోపే 2 కోట్ల ఎకరాల పచ్చని మాగాణమైంది!
కరువునేలగా అల్లాడిన తెలంగాణ ఇవ్వాళ దేశానికి బువ్వపెట్టే అన్నపూర్ణగా మారింది
సీఎం కేసీఆర్ నాయకత్వంలోని కిసాన్ సర్కార్ దేశంలో ఎక్కడాలేని విధంగా రైతన్నకు… pic.twitter.com/u7s4E7zEWt
">🌾🌱🌴🌿
— KTR (@KTRBRS) June 3, 2023
వ్యవసాయం దండుగ అన్నచోటనే పండుగ అయ్యింది. నెర్రెలు బారిన ఈ నేల దశాబ్ది లోపే 2 కోట్ల ఎకరాల పచ్చని మాగాణమైంది!
కరువునేలగా అల్లాడిన తెలంగాణ ఇవ్వాళ దేశానికి బువ్వపెట్టే అన్నపూర్ణగా మారింది
సీఎం కేసీఆర్ నాయకత్వంలోని కిసాన్ సర్కార్ దేశంలో ఎక్కడాలేని విధంగా రైతన్నకు… pic.twitter.com/u7s4E7zEWt🌾🌱🌴🌿
— KTR (@KTRBRS) June 3, 2023
వ్యవసాయం దండుగ అన్నచోటనే పండుగ అయ్యింది. నెర్రెలు బారిన ఈ నేల దశాబ్ది లోపే 2 కోట్ల ఎకరాల పచ్చని మాగాణమైంది!
కరువునేలగా అల్లాడిన తెలంగాణ ఇవ్వాళ దేశానికి బువ్వపెట్టే అన్నపూర్ణగా మారింది
సీఎం కేసీఆర్ నాయకత్వంలోని కిసాన్ సర్కార్ దేశంలో ఎక్కడాలేని విధంగా రైతన్నకు… pic.twitter.com/u7s4E7zEWt
- TS Formation Day 2023 : 'రానే రాదన్న తెలంగాణను సాధించి.. కానే కాదన్న అభివృద్ధిని చేసింది.. కేసీఆర్'
ఆ చర్యల వల్లే ఇదంతా..: ఈ క్రమంలోనే రైతులను సంఘటితం చేసేందుకు ప్రతి 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్ చొప్పున 2,601 రైతు వేదికలు ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. సకాలంలో నాణ్యమైన విత్తనాలు, ఎరువుల లభ్యతకు రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. పండిన పంట నిల్వకు నూతన మార్కెట్ షెడ్లు, గోదాముల నిర్మాణం చేపట్టామన్న ఆయన.. పండిన ధాన్యం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తూ అన్నదాతలకు అండగా నిలుస్తుందన్నారు. రైతన్నకు అండగా తీసుకున్న చర్యల మూలంగా తెలంగాణలో సాగు విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాల నుంచి 2.09 కోట్ల ఎకరాలకు పెరిగిందని మంత్రి వివరించారు.
ఇలాంటి కిసాన్ సర్కార్ ఎక్కడా లేదు..: రాష్ట్రం ఏర్పడిన 2014 తొలినాళ్లలో 68 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి.. నేడు 2.60 కోట్ల టన్నుల మెట్రిక్ టన్నులకు ధాన్యం ఉత్పత్తి పెరిగిందని కేటీఆర్ పేర్కొన్నారు. వ్యవసాయం దండుగ అన్నచోటనే పండుగ అయ్యిందని హర్షం వ్యక్తం చేశారు. నెర్రెలు బారిన ఈ నేల.. దశాబ్దిలోపే 2 కోట్ల ఎకరాల పచ్చని మాగాణమైందని వివరించారు. ఒకప్పుడు కరవు నేలగా అల్లాడిన తెలంగాణ.. ఇవాళ దేశానికి బువ్వ పెట్టే అన్నపూర్ణగా మారిందన్నారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ నాయకత్వంలోని కిసాన్ సర్కార్ దేశంలో ఎక్కడా లేని విధంగా రైతన్నకు అందిస్తున్న వరాల వల్లే ఈ అద్భుతం ఆవిష్కృతం అయ్యిందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
అనుబంధ రంగాలకు ప్రోత్సాహంతో రాష్ట్రంలో ఐదు విప్లవాలు : కేటీఆర్
- హరిత విప్లవం (ఆహార ధాన్యాలు)
- శ్వేత విప్లవం (పాడి పరిశ్రమ)
- నీలి విప్లవం (మత్స్య పరిశ్రమ)
- పింక్ విప్లవం (మాంసోత్పత్తి)
- పసుపు విప్లవం (నూనె గింజలు)
ఇవీ చూడండి..
'తెలంగాణ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారింది'
KTR Tweet On BJP : 'రేపిస్టులను సన్మానించే.. ఛాంపియన్లను అవమానించే పార్టీ.. బీజేపీ'