KTR Tweet About Modi Warangal Tour : ఉమ్మడి వరంగల్ జిల్లాలో మోదీ పర్యటన కొనసాగుతోంది. ప్రధాని పర్యటనపై తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీర్ స్పందించారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం హామీలను ట్విటర్ వేదికగా గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్లు అయినా ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం హామీలను పూర్తిగా నెరవేర్చలేదన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రధాని మోదీ రెండో తరగతికి చెందిన వారిగా చూస్తున్నారన్నారు. చట్టం హామీల్లో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేస్తామని... ఇప్పటి వరకు దాని ఊసు ఎత్తలేదన్నారు. గిరిజన ఏర్పాటు జాప్యం వల్ల యువత అవకాశాలు కోల్పోతుందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. దీనిపై ఐటీ మంత్రి కేటీఆర్ స్పందించారు.. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌కు లోకోమోటివ్ కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన అదే ఫ్యాక్టరీని రూ.20,000 కోట్ల పెట్టుబడితో.. ఎన్డీఏ ప్రభుత్వం గుజరాత్‌కు తరలించింది అని ట్విటర్ వేదికగా ఆరోపించారు. ఇవాళ తెలంగాణాలో రూ.520 కోట్ల పెట్టుబడితో ప్రధాని నరేంద్రమోదీ వ్యాగన్ రిపేర్షెడ్ను శంకుస్థాపన చేయడం అంటే.. తెలంగాణ ప్రజలను అవమానించడమే అని ట్విటర్లో వ్యాఖ్యానించారు.
KTR Tweet About AP Reorganization Act guarantees : తెలంగాణ ప్రజలను రెండో తరగతికి చెందినవారిగా చూస్తున్నందుకు ప్రధాని నరేంద్రమోదీ వివరణ ఇవ్వాలన్నారు. ఏపీ పునర్విభజన చట్టం హామీల్లో భాగంగా ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని బీజేపీ ప్రభుత్వం హామీ ఇచ్చిందని... యూనివర్సిటీ ఏర్పాటు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో వేలాది గిరిజన యువత అనేక అవకాశాలు కోల్పోతున్నారని మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆరేళ్ల క్రితమే ములుగు పరిసర ప్రాంతాల్లో 350 ఎకరాల భూమిని కేటాయించినప్పటికీ బీజేపీ కేంద్ర ప్రభుత్వం గిరిజన వర్సిటీని ఏర్పాట్లు చేయడంలో విఫలమైందని ఆరోపించారు.
ప్రధాని నరేంద్రమోదీ పర్యటనలో గిరిజన వర్సిటీపై స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. ఏపీ పునర్విభజన హామీల్లో ఒక్కటైన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు ఎన్నో ఏళ్ల కల అని మంత్రి కేటీఆర్ ట్విటర్లో పేర్కొన్నారు. గడిచిన 9 ఏళ్లలో అనేకసార్లు బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయంలో విజ్ఞప్తులు చేశామన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు కావాల్సిన వనరులు భూమి, నీళ్లు, విద్యుత్, బొగ్గు తెలంగాణలో ఉన్నాయన్నారు. ఇది మంజూరైతే 15,000ల మంది యువతకు ఉపాధి అవకాశం లభిస్తుందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ పర్యటనలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పై ప్రకటన చేయాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.
-
ఏపీ విభజన చట్టం కింద రాష్ట్రానికి ఒక గిరిజన యూనివర్సిటీ ఇవ్వాలని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. గిరిజన వర్సిటీ కోసం తెలంగాణ ప్రభుత్వం ములుగులో స్థలం కేటాయించి, తాత్కాలిక భవనం సిద్ధం చేసినా ఇప్పటివరకు ప్రకటించలేదు. ఫలితంగా రాష్ట్రంలోని వేలాది మంది గిరిజన… pic.twitter.com/8jekRQLI18
— Enugu Bharath Reddy (@BharathReddyTRS) July 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">ఏపీ విభజన చట్టం కింద రాష్ట్రానికి ఒక గిరిజన యూనివర్సిటీ ఇవ్వాలని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. గిరిజన వర్సిటీ కోసం తెలంగాణ ప్రభుత్వం ములుగులో స్థలం కేటాయించి, తాత్కాలిక భవనం సిద్ధం చేసినా ఇప్పటివరకు ప్రకటించలేదు. ఫలితంగా రాష్ట్రంలోని వేలాది మంది గిరిజన… pic.twitter.com/8jekRQLI18
— Enugu Bharath Reddy (@BharathReddyTRS) July 8, 2023ఏపీ విభజన చట్టం కింద రాష్ట్రానికి ఒక గిరిజన యూనివర్సిటీ ఇవ్వాలని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. గిరిజన వర్సిటీ కోసం తెలంగాణ ప్రభుత్వం ములుగులో స్థలం కేటాయించి, తాత్కాలిక భవనం సిద్ధం చేసినా ఇప్పటివరకు ప్రకటించలేదు. ఫలితంగా రాష్ట్రంలోని వేలాది మంది గిరిజన… pic.twitter.com/8jekRQLI18
— Enugu Bharath Reddy (@BharathReddyTRS) July 8, 2023
ఇవీ చదవండి: