ETV Bharat / state

బంధు పథకాలు కొంపముంచాయి - సిట్టింగ్​ ఎమ్మెల్యేలను మార్చి ఉండాల్సింది : కేటీఆర్​

KTR Speech at Zaheerabad Lok Sabha Preparatory Meeting : అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్​ ఎమ్మెల్యేలను మార్చి ఉంటే బాగుండేదని బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ అభిప్రాయపడ్డారు. బంధు పథకాల ప్రభావం కూడా బీఆర్​ఎస్​పై పడిందని చెప్పారు. హైదరాబాద్​లోని తెలంగాణ భవన్​లో జహీరాబాద్​ పార్లమెంటు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేటీఆర్​ ప్రసంగించారు.

KTR Speech
KTR Speech at Zaheerabad Lok Sabha Preparatory Meeting
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 7, 2024, 3:43 PM IST

KTR Speech at Zaheerabad Lok Sabha Preparatory Meeting : శాసనసభ ఎన్నికల్లో 119 సీట్లలో 39 సీట్లు గెలిచామని, ఇది తక్కువ సంఖ్య ఏం కాదని, మూడింట ఒక వంతు సీట్లు గెలిచినట్లేనని బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(KTR)​ పేర్కొన్నారు. హైదరాబాద్​లోని తెలంగాణ భవన్​లో జహీరాబాద్​ పార్లమెంటు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేటీఆర్​తో పాటు జహీరాబాద్​ లోక్​సభ నేతలు పాల్గొన్నారు. అనంతరం వారికి మాజీ మంత్రి కేటీఆర్​ దిశానిర్దేశం చేశారు.

2014లో అనివార్యంగా ఒంటరిగా పోటీ చేశామని, అప్పుడు సంస్థాగతంగా పార్టీ గట్టిగా లేకపోయినా ప్రజలు తమను దీవించారని మాజీ మంత్రి కేటీఆర్​ అన్నారు. జుక్కల్​లో హన్మంత్​ షిండే ఓడిపోతారని అస్సలు ఊహించలేదని చెప్పారు. కేవలం 1,100 ఓట్లతో షిండే ఓడిపోయారని, నాటి విషయాలను గుర్తు చేశారు. నారాయణ్​ఖేడ్ నుంచి వచ్చిన కాంగ్రెస్(Congress) నేత జుక్కల్​లో గెలిచారన్నారు. ఇలాంటి విచిత్రాలు చాలా జరిగాయని పేర్కొన్నారు. దళిత బంధు(Dalit Bandhu) పథకాన్ని నిజాంసాగర్​ మండలంలో 100 శాతం ఇచ్చినా, మిగతా వర్గాలు తమకు ఓట్లు వేయలేదని ఆవేదన చెందారు.

బంధు పథకాల ప్రభావం : ఒకరికి సాయం అందితే మరొకరు ఈర్ష్యపడేలా సమాజం తయారైందని ఎమ్మెల్యే కేటీఆర్​ తెలిపారు. ఈ బంధు పథకాల ప్రభావం తమపై పడిందని వ్యాఖ్యానించారు. కొత్త ఒక వింతలా, పాత ఒక రోతలా ప్రజలు భావించారన్నారు. కాంగ్రెస్​కు ఓట్లు వేసిన వారు కూడా కేసీఆర్​ సీఎం కానందుకు బాధ పడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో కేసీఆర్​ పట్ల అభిమానం చెక్కు చెదరలేదని స్పష్టం చేశారు.

'తెలంగాణ కోసం కడుపు చించుకుని కొట్లాడేది బీఆర్​ఎస్​ మాత్రమే. బీఆర్​ఎస్​ బలంగా లేకపోతే మళ్లీ తెలంగాణ పదం మాయం చేసేందుకు పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. నెల రోజుల్లోనే కాంగ్రెస్​ ప్రభుత్వం అప్రతిష్ట మూటగట్టుకుంది. కాంగ్రెస్​ ఎమ్మెల్యేలకు ఇప్పటికే ప్రజల నుంచి నిరసన సెగలు మొదలయ్యాయి. అప్పుల బూచీ చూపించి హామీల నుంచి తప్పించుకోవాలని కాంగ్రెస్​ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరగబోతోంది. ఈ మూడు ముక్కలాటలో బీఆర్​ఎస్​కే పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని' కేటీఆర్​ అన్నారు.

లోక్‌సభ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి - పార్టీ నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం

Zaheerabad Lok Sabha Election 2024 : కేసీఆర్​ పట్ల సానుభూతి, కాంగ్రెస్​కు దూరమైన వర్గాలు పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్​ఎస్​ విజయానికి బాటలు వేస్తాయని కేటీఆర్​ ఆశాభావం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్​లను మార్చి ఉండే బాగుండేదనే అభిప్రాయం బలంగా ఉందన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో అలాంటి పొరపాట్లు జరగనివ్వమని, కాంగ్రెస్​ ప్రభుత్వం అనేక తిరోగమన చర్యలకు పాల్పడుతోందని, బీఆర్​ఎస్​ తెచ్చిన పథకాలు రద్దు చేస్తున్నారని విమర్శించారు. జహీరాబాద్​ పార్లమెంటు సీటును బీఆర్​ఎస్​ కచ్చితంగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ అన్నప్పుడు ఎత్తుపల్లాలు తప్పవని, 2009లో పది అసెంబ్లీ సీట్లే గెలిచిన పార్టీ కేవలం ఆరు నెలల్లోనే కేసీఆర్​ దీక్షతో పరిస్థితి పూర్తిగా మారిందని కేటీఆర్​ గతాన్ని గుర్తు చేశారు. అక్కడి నుంచి గులాబీ జెండా అంటే గౌరవం పెరిగిందన్నారు.

కాంగ్రెస్​ 420 హామీలు : కాంగ్రెస్​ 420 హామీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ఒత్తిడి పెంచాలని పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే కేటీఆర్​ పిలుపునిచ్చారు. జిల్లాల సంఖ్య తగ్గించేందుకు రేవంత్​ రెడ్డి కమిషన్​ వేస్తామంటున్నారని, కొత్త జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా అని ప్రశ్నించారు. ప్రభుత్వం మీద విమర్శల విషయంలో బీఆర్​ఎస్​ తొందరపడటం లేదని, అభివృద్ధిని తక్కువ చేసి చూపి అప్పుల పాలు చేశామని కాంగ్రెస్​ వాళ్లే మొదట దాడి మొదలు పెట్టారన్నారు. కాంగ్రెస్​ నేతలు బీఆర్​ఎస్​ శ్రేణులను విమర్శిస్తే, వదిలిపెట్టే ప్రసక్తి లేదని మాజీ మంత్రి కేటీఆర్​ స్పష్టం చేశారు.

పొరపాట్లు జరిగాయి - సరిదిద్దుకొని ముందుకెళ్తాం : కేటీఆర్

బీఆర్​ఎస్​ ఎంపీలు గెలవకపోతే పార్లమెంటులో తెలంగాణ పేరు అనామకం అవుతుంది : కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.