KTR Davos Tour Updates: దావోస్ పర్యటన ద్వారా రాష్ట్రానికి రూ.21,000 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు కోసం నాలుగు రోజుల పర్యటన ఫలవంతంగా సాగిందని తెలిపారు. 52 వాణిజ్య సమావేశాలు, 6 రౌండ్‌టేబుల్ సమావేశాలు, రెండుప్యానల్ డిస్కషన్లలో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. పలు దిగ్గజ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయని తెలిపారు.
టెక్‌దిగ్గజం మైక్రోసాఫ్ట్ రూ.16,000 కోట్ల పెట్టుబడితో.. హైదరాబాద్‌లో మరో మూడు డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. రూ. 2,000 కోట్ల పెట్టుబడితో భారతీ ఎయిర్‌టెల్.. భారీ హైపర్ స్కేల్ డేటా సెంటర్‌ను నిర్మించనుందని పేర్కొన్నారు. ఫార్మారంగానికి చెందిన యూరోఫిన్స్ సంస్థ జీనోమ్ వ్యాలీలో రూ.1,000 కోట్లతో అత్యాధునిక లేబొరేటరీ క్యాంపస్ ఏర్పాటు చేస్తోందని వివరించారు.
పెప్సికో, పీ అండ్ జీ, అల్లాక్స్, అపోలో టైర్స్ లిమిటెడ్, వెబ్‌పీటీ, ఇన్‌స్పైర్ బ్రాండ్స్ వంటి.. పలు అంతర్జాతీయ సంస్థలు రూ.2,000 కోట్ల పెట్టుబడులు పెడతామని ప్రకటించినట్లు కేటీఆర్ చెప్పారు. కొత్త పెట్టుబడులకు చెందిన సమావేశాలు సానుకూల ఫలితాలను ఇస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా మొదటి 30 మంది జాబితాలో కేటీఆర్‌కు స్థానం: ఈ సదస్సులోనే మంత్రి కేటీఆర్ మరో ఘనత సాధించారు. సామాజిక మాధ్యమాల ద్వారా.. ప్రభావితం చేసే జాబితాలో ఆయన చోటు సంపాదించారు. ప్రపంచ వ్యాప్తంగా మొదటి 30 మంది జాబితాలో కేటీఆర్‌కు స్థానం దక్కింది. భారతదేశం నుంచి ఇద్దరు యువనేతలు మాత్రమే ఈ జాబితాలో ఉన్నారు. అందులో ఒకరు కేటీఆర్ 12వ స్థానం కాగా.. మరొకరు ఎంపీ రాఘవ్ చద్దా 23వ స్థానంలో నిలిచారు. 22వ స్థానంలో కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ ఐటీ మంత్రిత్వ శాఖ ఉన్నాయి.
ఇద్దరిలోనూ మంత్రి కేటీఆర్ ముందంజలో ఉన్నారు. ఐటీ శాఖ మంత్రిగా.. తెలంగాణ ఐటీ పురోభివృద్ధికి కృషి చేస్తున్న కేటీఆర్.. సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎప్పటికప్పుడు ప్రజలతో మమేకమవుతూ సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్నారు. అటు అధికారిక, ఇటు వ్యక్తిగత రెండు ఖాతాల్లోనూ ఆయన అగ్రస్థానంలో నిలిచారు.
-
All thanks to my wonderful Team led ably by @jayesh_ranjan Garu 👏 https://t.co/uA6V2yY0S7
— KTR (@KTRTRS) January 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">All thanks to my wonderful Team led ably by @jayesh_ranjan Garu 👏 https://t.co/uA6V2yY0S7
— KTR (@KTRTRS) January 21, 2023All thanks to my wonderful Team led ably by @jayesh_ranjan Garu 👏 https://t.co/uA6V2yY0S7
— KTR (@KTRTRS) January 21, 2023
ఇవీ చదవండి: దావోస్‌లో పెట్టుబడుల ప్రవాహం.. రూ.2వేల కోట్లతో ఎయిర్‌టెల్ డేటా సెంటర్
హైదరాబాద్‌లో అమెజాన్ భారీ పెట్టుబడులు.. మంత్రి కేటీఆర్ హర్షం
సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన టీఎస్ఆర్టీసీ.. కలెక్షన్స్ ఎంతో తెలుసా?
రంగంలోకి INS వాగీర్.. డ్రాగన్ నౌకల మారణాస్త్రం.. దాడి చేస్తే చావుదెబ్బే!