ETV Bharat / state

మోదీపైనే ఛార్జిషీట్​ వేయాలి: కేటీఆర్​ - గ్రేటర్​ హైదరాబాద్​ ఎన్నికల ప్రచారం

రాష్ట్ర ప్రభుత్వంపై భాజపా ఛార్జిషీట్​ విడుదల చేయడంపై తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఈసారి కూడా తామే తొలి స్థానంలో ఉంటామని.. రెండో స్థానంలో మజ్లిస్‌ ఉంటుందని కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు.

ktr
మోదీపైనే ఛార్జీషీట్​ వేయాలి: కేటీఆర్​
author img

By

Published : Nov 24, 2020, 2:13 PM IST

Updated : Nov 24, 2020, 2:52 PM IST

భాజపా భారతదేశాన్ని అమ్మేస్తోందని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. దేశంలో ముస్లింలపై భాజపాకు ఎంత విధ్వేషం ఉందో అందరికీ అర్థమవుతోందన్నారు. లోయర్‌ సీలేరును తీసుకెళ్లి ఏపీలో కలిపింది భాజపా కాదా? అని ప్రశ్నించారు. ఇటీవల తెరాసపై ఛార్జిషీట్‌ విడుదల చేసిన కమలం పార్టీకు కేటీఆర్‌కు 50 ప్రశ్నలు సంధించారు.

పేకాట క్లబ్‌లు మూసివేయించినందుకా మాపై ఛార్జిషీట్‌? జీఎస్టీతో లక్షల మంది చిరు వ్యాపారుల పొట్టగొట్టారు.. వారు భాజపాపై ఛార్జిషీట్‌ వేయాలి. కరోనా సమయంలో చనిపోయిన వలస కార్మికుల ఆత్మలు ఛార్జిషీట్‌ వేయాలి. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెడుతున్నందుకు భాజపాపై రైతులు ఛార్జిషీట్‌ వేయాలి. పెట్టుబడుల ఉపసంహరణ దేశ భవిష్యత్‌ కోసమా.. గుజరాత్‌ పెద్దల కోసమా? ఐటీఐఆర్‌ రద్దు చేసింది ఎవరు? ఆరేళ్లలో హైదరాబాద్‌కు భాజపా ఏం చేసిందో చెప్పగలరా? వేలకోట్ల ఆదాయాన్ని సమకూర్చే ప్రభుత్వ రంగ సంస్థలను అడ్డికి, పావుసేరుకి తెగనమ్ముతున్నది మీరే కదా? ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌ అయిన ఇండియన్‌ రైల్వేను ప్రైవేటుపరం చేస్తోంది మీరు కాదా? 40 కోట్ల పాలసీదారులను కలిగిన ప్రపంచంలోనే అతిపెద్ద బీమా కంపెనీని తెగనమ్మేందుకు చేస్తున్న కుటిల ప్రయత్నాలు మీవి కావా? ఆరేళ్లకు 12 కోట్ల ఉద్యోగాలు ఇవ్వనందుకు మోదీపై ఛార్జిషీట్‌ వేయాలి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఈసారి కూడా మేమే తొలి స్థానంలో ఉంటాం.. రెండో స్థానంలో మజ్లిస్‌ ఉంటుంది

-కేటీఆర్‌, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు

ktr
కేటీఆర్​ సంధించిన ప్రశ్నలు
ktr
కేటీఆర్​ సంధించిన ప్రశ్నలు
ktr
కేటీఆర్​ సంధించిన ప్రశ్నలు
ktr
కేటీఆర్​ సంధించిన ప్రశ్నలు

ఇవీచూడండి: 'తెరాసకు ఓటేయండి... గ్రేటర్​ను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతాం'

Last Updated : Nov 24, 2020, 2:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.