ETV Bharat / state

KTR Review Meeting to Textile Officials : 'టెక్స్​టైల్​ వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలి'

KTR Meeting about Textile deportment : ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని వారోత్సవాలు జరిగేలా చూడాలని చేనేత, జౌళి శాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. టెక్స్​టైల్ రంగంలో పని చేస్తున్న ప్రతి కార్మికుడు మరింతగా అభివృద్ధి చెందాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

KTR Review Meeting to Textile Officials
KTR Review Meeting to Textile Officials
author img

By

Published : Jul 11, 2023, 9:11 PM IST

KTR talk about Textile deportment in Telangana : వచ్చే నెల ఏడో తేదీన జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా జరిపేలా ఏర్పాట్లు చేయాలని.. రాష్ట్ర వ్యాప్తంగా నేతన్నలకు కేంద్రంగా ఉన్న ప్రాంతాల్లో వారం రోజులపాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించేలా చూడాలని చేనేత, జౌళి శాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. టెక్స్ టైల్ శాఖ ఉన్నతాధికారులతో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్​లో సమీక్ష నిర్వహించిన మంత్రి.. నేతన్నలకు అందిస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. నేతన్నకు చేయూత, నేతన్నకు బీమా వంటి కీలకమైన కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు.

KTR Tweet on Textile Deportment : రాష్ట్రంలో ఉన్న హ్యాండ్లూమ్ సొసైటీల పనితీరును మరింతగా మెరుగుపరిచి, అందులో సభ్యులుగా ఉన్న నేతన్నల స్థితిగతులను మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన కార్యక్రమాలు, సంబంధించిన అంశాలపై సమావేశంలో కేటీఆర్ విస్తృతంగా చర్చించారు. రాష్ట్రంలోని నేతన్నల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన నిధుల సమీకరణ, అందుబాటులో ఉన్న వివిధ అంశాలు, అవకాశాలపై చర్చించారు. నేతన్న చేయూత, నేతన్నకు బీమా కార్యక్రమాలను మరింతగా విస్తృతపరచాలని తెలిపారు.

శరవేగంగా సాగుతున్న కాకతీయ మెగా జౌళి పార్కు పనులు..

KTR Tweet About Textile Deportment Celebrations : చేనేత మిత్ర పథకాన్ని మరింత సరళీకరించేందుకు ఉన్న అంశాల గురించి తెలుసుకున్నారు. నేతన్నల యోగక్షేమాల కోసం కట్టుబడి ఉన్నామని అన్నారు. టెక్స్​టైల్ రంగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్మికుడు మరింతగా అభివృద్ధి చెందాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను మరింతగా నేతన్నల్లోకి తీసుకుపోయేందుకు అవసరమైన అవగాహన కార్యక్రమాలతో పాటు, ఇతర కార్యక్రమాలను కలిపి చేనేత వారోత్సవాలు నిర్వహించాలని కేటీఆర్ కోరారు. నేతన్నలతో పాటు, చేనేత ఉత్పత్తుల పట్ల ఆసక్తి చూపించే పలు సంస్థలు, వ్యక్తులను, రాష్ట్రంలోని ప్రజా ప్రతినిధులను వారాత్సోవాల్లో భాగస్వాములను చేయాలని సూచించారు.

  • చేనేత జౌళి శాఖపై మంత్రి @KTRBRS సమీక్షా సమావేశం

    - ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని వారోత్సవాలు

    చేనేత జౌళి శాఖపై తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈరోజు సుదీర్ఘ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో… pic.twitter.com/9zrg0NcMBq

    — BRS Party (@BRSparty) July 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

టెక్స్​టైల్ శాఖ తరఫున మ్యూజియంలను ఏర్పాటు చేయాలి : హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన శిల్పారామాల్లో టెక్స్​టైల్ శాఖ తరఫున మ్యూజియంలను ఏర్పాటు చేయాలని.. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పట్నుంచే ప్రారంభించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఆర్టీసీ, దక్షిణ మధ్య రైల్వేను సంప్రదించి హ్యాండ్లూమ్ ఉత్పత్తుల మార్కెటింగ్​కు అవసరమైన సహకారాన్ని తీసుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నేతన్నల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, వాటి పనితీరు, అమలు, ఫలితాలు, అయా కార్యక్రమాల్లో అవసరమైన మార్పు చేర్పులు సూచించేందుకు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వంటి సంస్థలతో అధ్యయనం చేయించాలని టెక్స్ టైల్ శాఖ అధికారులకు మంత్రి కేటీఆర్ సూచించారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.