ETV Bharat / state

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై తెరాస నేతలకు కేటీఆర్‌ కీలక సూచన - KTR Twitter Latest News

KTR Tweet on TRS MLAs Buying Issue: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ప్రాథమిక దర్యాప్తు దశలో ఉందని పేర్కొన్నారు. తెరాస నేతలు మీడియా ముందు ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని కేటీఆర్‌ సూచించారు.

KTR response to  purchase of MLAs
KTR response to purchase of MLAs
author img

By

Published : Oct 27, 2022, 6:50 PM IST

KTR Tweet on TRS MLAs Buying Issue: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ప్రాథమిక దర్యాప్తు దశలో ఉందని తెలిపారు. ఈ విషయంపై తెరాస నేతలు మీడియా ముందు ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు. అడ్డంగా దొరికిన దొంగలు నోటికొచ్చినట్లు మాట్లాడతారని విమర్శించారు. పార్టీ శ్రేణులు వాటిని పట్టించుకోనవసరం లేదని కేటీఆర్‌ ట్విటర్ వేదికగా స్పష్టం చేశారు.

  • ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు ప్రాథమిక విచారణ దశలో ఉన్నందున టిఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా ముందు ఎలాంటి వాఖ్యానాలు చేయవద్దని విజ్జప్తి

    అడ్డంగా దొరికిన దొంగలు నోటికొచ్చినట్టు మొరుగుతూనే వుంటారు. వీటిని పార్టీ శ్రేణులు ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం
    లేదు

    — KTR (@KTRTRS) October 27, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అసలేం జరిగిదంటే: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న వేళ పలువురు నేతలు పార్టీలు మారుతున్నారు. ఈ క్రమంలో నగర శివారులో నలుగురు అధికార తెరాస పార్టీ ఎమ్మెల్యేలు గువ్వల బాల్‌రాజ్‌, పైలెట్‌ రోహిత్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, రేగా కాంతారావును పార్టీ లో చేర్చుకునేందుకు భాజపాకు చెందిన ముగ్గురు వ్యక్తులు మొయినాబాద్​ లోని ఓ ఫాంహౌస్‌లో చర్చలు జరుపుతున్నారనే వార్త కలకలం రేపింది. చర్చలు జరుగుతుండగా పోలీసులు అక్కడకు చేరుకుని ముగ్గరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురితో చర్చలు జరుపుతున్న సమయంలోనే ఎమ్మెల్యేలు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఫాంహౌస్‌ ను చుట్టుముట్టారు. నలుగురు ఎమ్మెల్యేలను ఒక వైపు.. మిగిలిన ముగ్గురిని మరో వైపు కూర్చోబెట్టి విచారించారు. ఎమ్మెల్యేలను కలవడానికి వచ్చిన సతీష్‌ శర్మ, సింహయాజి, నందకుమార్‌ గా గుర్తించారు. సింహయాజితో రోహిత్‌రెడ్డికి గతంలో పరిచయం ఉన్నట్టు తేల్చారు. రోహిత్‌రెడ్డి గతంలో సింహయాజి స్వామీజీ చేత తన ఇంట్లో ఓ పూజ కూడా చేయించుకున్నట్టు సమాచారం. తరచూ సింహయాజి స్వామీజీని కలుస్తున్నట్లు సమాచారం. అదే చనువుతో స్వామీజీ భాజాపాలోకి చేరాలని అతనికి చెప్పినట్టు సమాచారం. అతనితో పాటు మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలను కూడా బుధవారం కలుద్దామని నిర్ణయించారు. ఇందుకు రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌ను ఎంచుకున్నారు.

బుధవారం సాయంత్రం సింహయాజి, నందకుమార్‌, సతీష్‌శర్మ అక్కడికి చేరుకున్నారు. అంతకు ముందే నలుగురు ఎమ్మెల్యేలు కూడా ఫాంహౌస్‌కు చేరుకున్నారు. ఈ సమాచారం అంతా పోలీసులకు ముందుగానే ఎమ్మెల్యేలు చేరవేశారు. దీంతో చర్చలు జరుగుతుండగా పోలీసులు రంగంలోకి దిగారు. అక్కడి నుంచి గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్ధన్‌రెడ్డి పోలీసుల సహాయంతో వెళ్లిపోయారు. అనంతరం రోహిత్‌రెడ్డిని గంటపాటు విచారించారు. అనంతరం ఆయన కూడా పోలీసు వాహనంలో భద్రత మధ్య వెళ్లిపోయారు. సింహయాజి, సతీష్‌ శర్మ, నందకుమార్​లను పోలీసులు మూడు గంటల పాటు విచారించారు. తమ ప్రలోభ పెట్టారని ఇబ్బందులకు గురిచేశారని నలుగురు ఎమ్మెల్యేలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వారి ముగ్గురిని అరెస్టు చేశారు.

ఇవీ చదవండి: తెరాసతో నందకుమార్‌కు సత్సంబంధాలు.. ఇవిగో సాక్ష్యాలు: కిషన్‌రెడ్డి

'జోడో యాత్రకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక.. భాజపా, తెరాస ఈ నాటకానికి తెరతీశాయి'

తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం.. రాష్ట్రవ్యాప్తంగా గులాబీ శ్రేణుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.