KTR Reacts on Pravalika Incident : ప్రవళిక మరణాన్ని విపక్షాలు రాజకీయానికి వాడుకుంటున్నాయని.. మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కరీంనగర్‌లో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేటీఆర్ ప్రవళిక మరణంపై స్పందిస్తూ.. విపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తనను ప్రవళిక కుటుంబ సభ్యులు(Family Members) ఇవాళ కలిశారని.. వాళ్లకు ధైర్యం చెప్పినట్లు మంత్రి వివరించారు.
Pravalika Family Members Meet KTR : ప్రవళిక కుటుంబానికి జరిగిన నష్టాన్ని పూడ్చలేం కానీ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటామని అన్నారు. ఆమె హత్యకు కారణమైన శివరాంను చట్టపరంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని .. ప్రవళిక కుటుంబ సభ్యులకు కేటీఆర్ వివరించినట్లు తెలిపారు. అదేవిధంగా ప్రణయ్(ప్రవళిక సోదరుడు)కు ఉద్యోగం కూడా ఇస్తామని హామీ ఇచ్చినట్లు మంత్రి తెలిపారు.
ప్రవళిక ఆత్మహత్య గురించి కేటీఆర్.. డీజీపీతో కూడా మాట్లాడారని.. తమ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారని ప్రవళిక సోదరుడు ప్రణయ్ తెలిపాడు. బిడ్డను కోల్పోయిన బాధలో ఉంటే కాంగ్రెస్ నాయకులు(Congress Leaders) ప్రవళిక ఆత్మహత్యను రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూస్తున్నారని.. మమ్మల్ని వేదించొద్దని ప్రవళిక తల్లి, సోదరుడు ప్రణయ్ ఇప్పటికే విజ్ఞప్తి చేశారు.
మంత్రి కేటీఆర్‌ను కలిసేందుకు మేము ఊరి నుంచి వచ్చాం. అక్క విషయంలో జరిగిన విషయమంతా మంత్రితో చెప్పుకున్నాం. అక్క ప్రవళికను వేధించిన శివరాం గురించి పోలీసులను అడిగి కేటీఆర్ తెలుసుకున్నారు. అనంతరం డీజీపీతో చర్చించినట్లు మాకు చెప్పారు. శివరాంకు శిక్షపడేలా చేస్తామని కేటీఆర్ చెప్పారు. ప్రభుత్వం నుంచి కూడా అన్నివిధాలుగా తమకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు -ప్రణయ్, ప్రవళిక సోదరుడు
వారందరిపై కేసులు నమోదు : మరోవైపు ప్రవళిక ఆత్మహత్య చేసుకున్న తర్వాత అశోక్ నగర్లో ఆందోళనకు దిగిన పలు రాజకీయ పార్టీల నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అక్టోబర్ 13 రాత్రి అశోక్ నగర్ ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. పోలీసులకు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఏసీపీ, ఎస్సైతో పాటు పలువురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. విద్యార్థులను రెచ్చగొట్టారనే కారణంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, బీజైవైఎం నాయకుడు భానుప్రకాష్, కాంగ్రెస్ నాయకులు ఫిరోజ్ ఖాన్, అనీల్ కుమార్, విజయారెడ్డితో పాటు పలువురిపై కేసు నమోదు చేశారు.
Complaint in HRC on Pravallika death : మరోవైపు ప్రవళిక ఆత్మహత్యపై న్యాయ విచారణ చేయించాలని.. బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ అశోక్ నగర్లో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ప్రవళిక ఉదంతంపై.. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో(High Court Sitting Judge) సమగ్ర విచారణ చేయించాలని కోరారు. ఎన్నికల్లో ఓటమి పాలవుతామనే భయంతోనే ప్రభుత్వం.. ప్రవళిక ఉదంతాన్ని తొక్కి పెడుతోందని పేర్కొన్నారు.
ఆమె ఆత్మహత్యపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు పూర్తి అర్ధరహితమన్నారు. ప్రభుత్వం తన అసమర్ధతను ఒప్పుకోలేకనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్లు తెలిపారు. ఘటనాస్థలిలో పోలీసులు తనపై అనుచితంగా ప్రవర్తించారని.. దీనికి సంబంధించిన ఆధారాలను(Related Evidence) దాసు సురేశ్ మానవ హక్కుల కమిషన్‌కు అందించారు.